‘మాలిని అండ్‌ కో’ రివ్యూ

పూనం పాండే తెలియని నెటిజన్‌ ఉండడు అంటే అందులో అతిశయోక్తి ఉండదేమే.

ఈమె హాట్‌ వీడియోలు మరియు హాట్‌ ఫొటోలు ఎప్పటికప్పుడు వెబ్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో వస్తూనే ఉన్నాయి.

వెబ్‌ మీడియా ద్వారా భారీ క్రేజ్‌ను దక్కించుకున్న ఈ అమ్మడు తెలుగులో ‘మాలిని అండ్‌ కో’ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

నేడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయింది.‘మాలిని అండ్‌ కో’లో పలువురు నటీ నటులు ఉన్నా కూడా ఎక్కువగా పూనం పాండేనే హైలైట్‌ అయ్యింది.

ఈ సినిమాలో పూనం అందాలు తప్ప మరేం ప్రత్యేకంగా లేవు అని, సినిమా కథ, కథనం, దర్శకత్వం, సంగీతం ఇవేవీ కూడా కనిపించడం లేదు.యూత్‌ ఆడియన్స్‌ మరియు పూనం పాండే అభిమానులు ఎంజాయ్‌ చేయవచ్చు.

Advertisement

కాని రెగ్యులర్‌ సినిమాలను ఇష్ట పడే వారికి మాత్రం ఈ సినిమా నచ్చదు.మొత్తానికి ఈ సినిమాతో పూనంకు తెలుగులో గ్రాండ్‌ ఎంట్రీ దక్కింది.

సక్సెస్‌ వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని విశ్లేషకులు అంటున్నారు.భవిష్యత్తులో అయినా ఈమె సక్సెస్‌లను దక్కించుకుంటుందా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు