డిసెంబర్ 31 వరకు మలేసియాలో భారతీయులకి నో ఎంట్రీ

ఆసియాలో టూరిజంతో కమర్షియల్ హబ్ గా మారిన దేశం అంటే మలేసియా అని చెబుతారు.

ఈ దేశ విస్త్రీర్ణం తక్కువ అయిన టూరిస్ట్ ల సంఖ్య అక్కడ విపరీతంగా ఉంటుంది.

చాలా దేశాల నుంచి టూరిస్ట్ లు మలేసియా వెళ్తూ ఉంటారు.ఇండియాలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమాలు అంటే మలేసియా వెళ్ళిపోతారు.

తెలుగు సినిమాలు కూడా ఎక్కువ మలేసియా నేపధ్యంలో తెరకెక్కాయి.టూరిజం హబ్ గా ఉన్న మలేసియా కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పుడు సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

దేశంలో ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండటానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.డిసెంబర్ 31 వరకు తమ దేశానికి రావద్దంటూ 22 దేశాలను నిషేధించింది.

Advertisement

ఈ జాబితాలో ఉన్న దేశాల పౌరులు తమ దేశానికి రావద్దని విన్నవించింది.ఈ దేశాల జాబితాలో భారత్ కూడా ఉండటం గమనార్హం.

ఇండియాలో కరోనా అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉండటంతో భారతీయులు మలేసియా రాకుండా నిషేధం విధించింది.కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

తాజాగా మలేసియా తీసుకున్న నిర్ణయంతో అక్కడున్న మన వారు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది.మలేసియాలో ఇప్పటి వరకు 9,868 కరోనా కేసులు నమోదు కాగా, వీరిలో 9,189 మంది కోలుకున్నారు.128 మంది ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం అక్కడ కరోనా కంట్రోల్ లో ఉంది.

ఈ నేపధ్యంలో విదేశీయులని వీలైనంత వరకు తగ్గించాలని భావించి మలేసియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ నేపధ్యంలో మలేసియాలో షూటింగ్ లు పెట్టుకోవాలని భావించిన దర్శకులని కూడా కాస్తా ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు