రతి నిర్వేదం రీ రిలీజ్... కలిసి రాబోతున్న ఆ రెండు

మలయాళం సూపర్‌ హిట్‌ మూవీ రతి నిర్వేదం ( Rathi Nirvedam )ను అదే టైటిల్ తో తెలుగు లో డబ్ చేసి విడుదల చేయడం జరిగింది.2011 సంవత్సరం లో వచ్చిన రతి నిర్వేదం సినిమా అప్పట్లో యూత్ ని పిచ్చెక్కించింది.

డబ్బింగ్ సినిమా అని కూడా పట్టించుకోకుండా ఈ సినిమా ను తెలుగు లో భారీ ఎత్తున ప్రేక్షకులు చూశారు.

ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.అప్పట్లో మొబైల్స్, సోషల్‌ మీడియా పెద్దగా లేదు.దాంతో సినిమా ను బి గ్రేడ్‌ అంటూ ప్రచారం చేయడం తో మరింత ఎక్కువ మంది చూశారు.

దాంతో కలెక్షన్స్ భారీగా నమోదు అయ్యాయి.

ఒక డబ్బింగ్‌ సినిమా అంత భారీగా వసూళ్లు సాధించడం గొప్ప విషయం అన్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది.హీరోయిన్‌ గా శ్వేత మీనన్( Shwetha Menon ) నటించింది.తనకంటే చాలా పెద్ద వయసు అయిన లేడీని హీరో ప్రేమించి ఆమెతో బెడ్‌ షేర్ చేసుకుంటాడు.

Advertisement

ఆ తర్వాత ఏం జరిగింది.అలా జరగడానికి వెనుక ఉన్న పరిణామాలు ఏంటి అనేది సినిమా కథ.1970 లో భరతన్‌ అనే రచయిత రాసిన రతి నిర్వేదం అనే నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా లో శ్వేతా మీనన్ హద్దులు దాటి మరీ అందాలను చూపించి శృంగార సన్నివేశాల్లో నటించింది.

జూనియర్ షకీలా ( Shakeela )అంటూ చాలా మంది ఆ సమయంలో ఆమెను పిలుచుకున్నారు.ఇప్పుడు ఆ సినిమా ను రీ రిలీజ్ చేయబోతున్నారు.ఈ వారంలోనే రతి నిర్వేదం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ లు ఎక్కువ అయ్యాయి.ఈ సినిమా రీ రిలీజ్ అయితే కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది.

ఈ సినిమా పట్ల యూత్‌ లో ఇంకా క్రేజ్ ఉంది.అంతే కాకుండా ఈ సినిమాకు పోటీ అనేది పెద్దగా లేదు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

కనుక కచ్చితంగా ఈ సినిమా రీ రిలీజ్ విషయం లో కలిసి వస్తుందని, గతంలో సాధించిన రేంజ్ లో కాకుండా మంచి వసూళ్లను ఈ సినిమా రాబడుతుందనే నమ్మకం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు