రతి నిర్వేదం రీ రిలీజ్… కలిసి రాబోతున్న ఆ రెండు
TeluguStop.com
మలయాళం సూపర్ హిట్ మూవీ రతి నిర్వేదం ( Rathi Nirvedam )ను అదే టైటిల్ తో తెలుగు లో డబ్ చేసి విడుదల చేయడం జరిగింది.
2011 సంవత్సరం లో వచ్చిన రతి నిర్వేదం సినిమా అప్పట్లో యూత్ ని పిచ్చెక్కించింది.
డబ్బింగ్ సినిమా అని కూడా పట్టించుకోకుండా ఈ సినిమా ను తెలుగు లో భారీ ఎత్తున ప్రేక్షకులు చూశారు.
ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.అప్పట్లో మొబైల్స్, సోషల్ మీడియా పెద్దగా లేదు.
దాంతో సినిమా ను బి గ్రేడ్ అంటూ ప్రచారం చేయడం తో మరింత ఎక్కువ మంది చూశారు.
దాంతో కలెక్షన్స్ భారీగా నమోదు అయ్యాయి. """/" / ఒక డబ్బింగ్ సినిమా అంత భారీగా వసూళ్లు సాధించడం గొప్ప విషయం అన్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది.
హీరోయిన్ గా శ్వేత మీనన్( Shwetha Menon ) నటించింది.తనకంటే చాలా పెద్ద వయసు అయిన లేడీని హీరో ప్రేమించి ఆమెతో బెడ్ షేర్ చేసుకుంటాడు.
ఆ తర్వాత ఏం జరిగింది.అలా జరగడానికి వెనుక ఉన్న పరిణామాలు ఏంటి అనేది సినిమా కథ.
1970 లో భరతన్ అనే రచయిత రాసిన రతి నిర్వేదం అనే నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా లో శ్వేతా మీనన్ హద్దులు దాటి మరీ అందాలను చూపించి శృంగార సన్నివేశాల్లో నటించింది.
"""/" / జూనియర్ షకీలా ( Shakeela )అంటూ చాలా మంది ఆ సమయంలో ఆమెను పిలుచుకున్నారు.
ఇప్పుడు ఆ సినిమా ను రీ రిలీజ్ చేయబోతున్నారు.ఈ వారంలోనే రతి నిర్వేదం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ లు ఎక్కువ అయ్యాయి.ఈ సినిమా రీ రిలీజ్ అయితే కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది.
ఈ సినిమా పట్ల యూత్ లో ఇంకా క్రేజ్ ఉంది.అంతే కాకుండా ఈ సినిమాకు పోటీ అనేది పెద్దగా లేదు.
కనుక కచ్చితంగా ఈ సినిమా రీ రిలీజ్ విషయం లో కలిసి వస్తుందని, గతంలో సాధించిన రేంజ్ లో కాకుండా మంచి వసూళ్లను ఈ సినిమా రాబడుతుందనే నమ్మకం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధుడిని బ్రతికుండగానే పూడ్చిపెట్టారు.. 4 రోజుల తర్వాత తవ్వి తీస్తే?