మహేష్ లవ్ ట్రాక్ అదిరిపోతుందట.. ఎడిటర్ మార్తాండ్ కామెంట్స్..!

సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

మే 12న గ్రాండ్ గా రిలీజ్ అవబోతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా వెరైటీగా ఆర్ట్ డైరక్టర్, ఎడిటర్ వీరితో ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేస్తున్నారు.

స్టార్ హీరో సినిమా గురించి ఇలా టెక్నికల్ టీం సెపరేట్ ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే మొదటిసారి.మొన్నామధ్య ఆర్ట్ డైరక్టర్ మీడియాతో ముచ్చటించగా లేటెస్ట్ గా సర్కారు వారి పాట ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ సర్కారు వారి పాట సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు.

సినిమా తప్పకుండా మహేష్ కెరియర్ లో మరో పోకిరి అవుతుందని అన్నారు.అంతేకాదు మహేష్, కీర్తి సురేష్ ల లవ్ ట్రాక్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అన్నారు.

Advertisement

సినిమా ఎడిటర్ ఇలా చెప్పాడు అంటే సినిమా తప్పకుండా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు