హాలీవుడ్ నుండి రానున్న టాప్ యాక్షన్ మూవీస్ ఇవే?

హాలీవుడ్ సినిమాలు అంటే ఏ రేంజ్ లో ఉంటాయి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.వాస్తవంగా చెప్పాలంటే సౌత్ లో ఇప్పుడు ఇంత మంచి ఆక్షన్ మూవీస్ వస్తున్నాయి అంటే హాలీవుడ్ ప్రభావం ఉంది అని చెప్పాలి.

 Hollywood Movies Who Are Coming In Recent Days, James Cameron, Thor, Rajamouli,-TeluguStop.com

ఈ సినిమాలలో కంటెంట్ తక్కువ ఉన్నా.యాక్షన్ సీన్స్, సెట్టింగ్స్, ఛేజింగ్ సీన్స్, ఆర్ట్ వర్క్, సిజి వర్క్ ఇలా చెప్పుకుంటూపోతే ఇప్పటికీ రాజమౌళి లాంటి డైరెక్టర్ లు హాలీవుడ్ టెక్నీషియన్ లను ఎందుకు వాడుకుంటారో కారణం అదే.కరోనా కారణంగా కొంతకాలం హాలీవుడ్ నుండి వచ్చే యాక్షన్ సినిమాలకు బ్రేక్ పడింది.కానీ ఇప్పుడు వరుసగా హాలీవుడ్ లోని యాక్షన్ ఫీస్ట్ ను అందించడానికి రెడీ అవుతున్నాయి.

మరి త్వరలో రానున్న ఆ హాలీవుడ్ సినిమాలు ఏమిటో ఇప్పుడు ఒక లుక్ వేద్దాం.

అయితే ఈ హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే… రోజుల్లోనే వందల కోట్ల కలెక్షన్ లను సాధిస్తాయి.

వీటి దెబ్బకు సౌత్ సినిమాలు ఒక పక్కకు కూడా రావు అని చెప్పాలి.అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సమ్మర్ సీజన్ నుండి హాలీవుడ్ సినిమాల సందడి మొదలు కానుంది.

ఒక్కసారి మొదలైన ఈ సందడి ఈ సంవత్సరం చివరి వరకు ఉంటుందట.ఇంకొక వారంలో అవెంజర్ ఎండ్ గేమ్ లో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ మూవీతో మొదలు కాబోతున్న ఈ హాలీవుడ్ హంగామా… ఆ తర్వాత ఇక అన్ స్టాపబుల్ అని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా తర్వాత హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ మిషన్ ఇంపోజిల్ సిరీస్ 7 తో మన ముందుకు వచ్చేస్తున్నాడు.ఈ సినిమా మిషన్ ఇంపోజిబిల్ పేరుతో 26 సంవత్సరాలుగా సీజన్ ల పేరిట తెరకెక్కిస్తూనే ఉన్నారు.

ఒక్కసారి టామ్ అడుగు పెట్టాడంటే అక్కడ ఇక గన్ లతో బుల్లెట్ల వర్షమే కురుస్తుంది.భారీ యాక్షన్ ఛేజింగ్ సీన్ లతో ప్రేక్షకులకు వేసవి విడిదిని అందిస్తాడు.

ఇతను సినిమాలకు ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా యువకులు బాగా ఇష్టంగా చూస్తారు.

ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మంచి యాక్షన్ మూవీ టాప్ గన్ మెవరిక్ మే నెల చివరి వారంలో విడుదల కానుంది.ఇక ఇదే విధముగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు జురాసిక్ వరల్డ్ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యి మంచి వ్యూస్ తో దసూసుకుపోతోతొంది.ఈ ట్రైలర్ వలన ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమా జూన్ 10 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుందని చిత్ర బృందం తెలిపింది.

Telugu Avenger Game, Black Panther, Cruise, Gun Maverick, Hollywood, Hollywood D

అవెంజర్స్ లో ఒక్కడైనా థార్ నటించిన చిత్ర్రం థార్… సరికొత్తగా ప్రేమ ఎమోషన్ ను ముడిపెడుతూ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా జులై 8 న రిలీజ్ అవుతుంది.థార్ కు ఇండియాలో అభిమానులు ఉన్నారు.

ఇక మోస్ట్ అవైటింగ్ మూవీ బ్లాక్ పాంథర్ నవంబర్ లో రానుంది.ఇక వీటన్నిటికన్నా రెండింతలు యాక్షన్, గ్రాఫిక్స్, విజువల్ వండర్ ను చూపించే సినిమా అవతార్ 2 కోసం వేయికళ్లతో అందరూ ఎదురుచూస్తున్నారు.

అవతార్ సినిమాను జేమ్స్ కెమరూన్ డైరెక్ట్ చేశారు.ఈయన డైరెక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఈ సినిమా డిసెంబర్ ౧౬ న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవనుంది.ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలు ఇప్పటికే కొన్ని లెక్కలు వేసుకుంటున్నారు.

ఇప్పటి వరకు ఉన్న అన్ని కలెక్షన్ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అంటున్నారు.మరి చూద్దాం ఈ సినిమాలు అన్నీ రిలీజ్ అయి మన ప్రేక్షకులకు ఎటువంటి వినోదాన్ని అందిస్తాయో?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube