మహేష్ బాబును అన్నా అంటూ స్పెషల్ థాంక్స్ చెప్పిన దుల్కర్ సల్మాన్... ఎందుకో తెలుసా?

మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan ) ప్రస్తుతం తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఈయన సీతారామం( Sitaramam ) సినిమా ద్వారా హీరోగా పూర్తిస్థాయి తెలుగు సినిమాలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ సినిమా అద్భుతమైన ఆదరణ అందుకోవడంతో ఈయనకు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి .ఇలా తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ఆయన నటించిన సినిమాలన్నింటిని కూడా తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ ఐశ్వర్య లక్ష్మి( Aishwarya Lakshm ).జంటగా నటించిన చిత్రం కింగ్ ఆఫ్ కోట ( King of Kota ).ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో విడుదల కానున్నటువంటి నేపథ్యంలో అన్ని భాషలలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది.

ఈ టీజర్ ను మలయాళంలో దుల్కర్ తండ్రి సీనియర్ నటుడు ముమ్ముట్టి విడుదల చేయగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లాంచ్ చేశారు.ఇలా మహేష్ బాబు ఈ సినిమా టీజర్ లాంచ్ చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

Advertisement

ఈ సందర్భంగా మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కింగ్ ఆఫ్ కోట టీజర్ విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.దుల్కర్ సల్మాన్ ను మరోసారి ఆకట్టుకొని పాత్రలో చూస్తున్నందుకు సంతోషంగా ఉంది యావత్ చిత్ర బృందానికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ మహేష్ బాబు ట్వీట్ చేయడంతో వెంటనే స్పందించిన దుల్కర్ సల్మాన్ రిప్లై ఇస్తూ.థాంక్యూ సో మచ్ అన్నా అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

మహేశ్ బాబు వంటి అగ్రహీరో తమ చిత్రం టీజర్ విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.ఇప్పుడు మా చిత్ర బృందం మరింత సంతోషంలో విహరిస్తున్నాము అంటూ ఈ సందర్భంగా దుల్కర్ చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు