పరశురామ్‌కు క్లాస్‌ పీకిన నాగార్జున

గీత గోవిందం చిత్రం తర్వాత దర్శకుడు పరుశురామ్‌ ఆ హీరో ఈ హీరో చుట్టు అంటూ తిరిగి రెండు సంవత్సరాలు సమయం వృదా చేశాడు.చివరకు నాగచైతన్యతో నాగేశ్వరరావు అనే చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

14 రీల్స్‌ ప్లస్‌ వారు ఆ సినిమాను నిర్మించబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.కాని ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన మరో అడుగు పడలేదు.

తాజాగా పరుశురామ్‌ తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో చేయాలనే నిర్ణయానికి వచ్చాడు.

నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్న దర్శకుడు పరుశురామ్‌ మహేష్‌తో ఛాన్స్‌ రాగానే అటు వెళ్లడం వివాదాస్పదం అయ్యింది.నాగ చైతన్య విషయంలో పరుశురామ్‌ చూపించిన వివక్షపై అక్కినేని ఫ్యాన్స్‌ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చైతూ చిన్న హీరో అనే ఉద్దేశ్యంతో మహేష్‌తో ఆఫర్‌ రాగానే వెళ్తావా అంటూ ప్రశ్నించారు.

Advertisement

తాజాగా ఈ విషయమై నాగార్జున కూడా స్పందించినట్లుగా సమాచారం అందుతోంది.సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు పరుశురామ్‌తో నాగార్జున మాట్లాడుతూ మందలించినట్లుగా తెలుస్తోంది.

ఒక సినిమా కమిట్‌ అయినప్పుడు ఎంత పెద్ద ఆఫర్‌ వచ్చినా ఎంతటి పారితోషికం ఆఫర్‌ ఇచ్చినా కూడా వెళ్లకూడదు.ఇండస్ట్రీలో ఆ మోరల్స్‌ పాటించాలంటూ పరుశురామ్‌కు నాగార్జున క్లాస్‌ తీసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహేష్‌తో మూవీ చేసిన తర్వాత తప్పకుండా చైతూతో చేస్తానంటూ పరుశురామ్‌ అన్నట్లుగా తెలుస్తోంది.

సునామీలో టి సైలెంట్ నా ముందు నువ్వు సైలెంట్.. ఈ సినిమాతో శ్రీలీలకు హిట్టొస్తుందా?
Advertisement

తాజా వార్తలు