ఐబీఎం సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తెలుగు తేజం అరవింద్ కృష్ణ

అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా తెలుగు తేజం అరవింద్ కృష్ణ బాధ్యతలు స్వీకరించారు.

సోమవారం గిన్నీ రోమెట్టి స్థానంలో ఆయన సంస్థ పగ్గాలు అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన కృష్ణ ఐఐటీ కాన్పూర్‌లో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.అనంతరం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పీహెచ్‌డీ పట్టా పొందారు.15 పేటెంట్లకు రచయితగా ఉన్న అరవింద్ కృష్ణ, 1990లో ఐబీఎంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.

కంపెనీ జనరల్ మేనేజర్‌గా, ఐబీఎం సాఫ్ట్‌వేర్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్‌గా, ఐబీఎం రీసెర్చ్‌లోనూ కీలకమైన పలు టెక్నికల్ బాధ్యతలు నిర్వర్తించారు.ఐబీఎం సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, ముందుండి నడిపించారు.కృత్రిమ మేథ, క్లౌడ్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతను అభివృద్ధి చేయడంలో అరవింద్ కీలకంగా వ్యవహరించారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో ఆయనను ఐబీఎం సీఈవో‌, డైరెక్టర్ల బోర్డు సభ్యుడిగా ఎంపిక చేశారు.కాగా అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న తెలుగువాళ్లలో అరవింద్ కృష్ణ నాలుగో వ్యక్తి.

Advertisement

ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల, తెలుగు మూలాలున్న సుందర్ పిచ్చయ్ గూగుల్ సారథిగా, శంతను నారాయణ్ అడోబ్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు