మహేష్ బాబు ఇక మారడు అంతే

బిజినెస్ మెన్ ఆడియో ఫంక్షన్లో పూరి జగన్నాథ్ అన్నట్లు, మహేష్ సినిమా ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు.

పూరి జగన్నాథ్ దర్శకుడు కాబట్టే బిజినెస్ మెన్ త్వరగా పూర్తయ్యింది.

ఆ తరువాత చూసుకుంటే 1-నేనొక్కడినే ఓ సంవత్సరం మొత్తం తీసాడు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దసరాకి రావాల్సింది సంక్రాంతికి వచ్చింది అప్పట్లో.

మొన్నటి బ్రహ్మోత్సవం కూడా సంక్రాంతి కి రావాల్సిందిపోయి మేలో వచ్చింది.మురుగదాస్ సినిమా షెడ్యూల్స్ త్వరత్వరగా పూర్తవుతుండటంతో ఈసారి బాబు ట్రాక్ లో ఉన్నాడని సంబరపడ్డారు అభిమానులు.

ముందు అనుకున్నట్లుగా మార్చిలోనే సినిమా వస్తుందని ఆశపడుతున్నారు.కాని అసలు సినిమా షూటింగ్ పూర్తయ్యేదే మార్చిలో అని తెలియవస్తోంది.

Advertisement

సడెన్ గా ఈ ట్విస్ట్‌ ఏంటి, అలస్యం జరిగితే ఎందుకు జరుగుతుంది అనే విషయం బయటపడట్లేదు.మహేష్ ఎప్పటిలానే ఈసారి కూడా అనుకున్న టైమ్ కి రావడం కష్టమే అని, సినిమా మే లేదా జూన్ కి వాయిదా పడవచ్చు అని చెబుతున్నారు విశ్వసనీయ వ్యక్తులు.

ఇక అంతే .మహేష్ మారడు అని సర్దిచెప్పుకోవాలేమో సూపర్ స్టార్ ఫ్యాన్స్.

Advertisement

తాజా వార్తలు