మహేష్ బాబు చెల్లి నిహారిక పిల్లలను చూశారా.. ఎంత క్యూట్ గా ఉన్నారో?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒక్కడు మూవీ ఒకటనే సంగతి తెలిసిందే.

అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది.

గుణశేఖర్ డైరెక్షన్ లో ఎం.ఎస్.రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈ సినిమాలో మహేష్ బాబు చెల్లి పాత్రలో నిహారిక అనే నటి నటించారు.

అయితే ఒక్కడు తర్వాత ఈ నటి సినిమాలకు దూరంగా ఉన్నారు.తాజాగా ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ నటి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ప్రేమించుకుందాంరా సినిమాకు జయంత్ సి పరాన్జీ నుంచి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే తాను ఆశ్చర్యానికి గురయ్యానని ఆమె తెలిపారు.జయంత్ గారికి లాస్ట్ మినిట్ లో నా నంబర్ దొరికిందని నిహారిక చెప్పుకొచ్చారు.

Advertisement

తాను సినిమా ఇండస్ట్రీలోకి అనుకోకుండా వచ్చానని ఆమె అన్నారు.తాను పదో తరగతి చదువుతున్న సమయంలో ఒక్కడు షూటింగ్ జరిగిందని ఆమె తెలిపారు.

నేను సినిమాలలో నటిస్తానని చెబితే భర్త ఒప్పుకుంటారని ఆమె అన్నారు.నాకు పెళ్లై పదేళ్లు దాటిందని ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె తెలిపారు.తన పిల్లల వయస్సు ఏడు సంవత్సరాలు అని ఆమె చెప్పుకొచ్చారు.

నాన్నకు తాను సినిమాల్లో నటించడం ఇష్టం లేదని ఆమె కామెంట్లు చేశారు.

హైదరాబాద్ లో ఆడపిల్లలు ఉండరా అంటూ తాను చెప్పిన డైలాగ్ ప్రేమించుకుందాంరా సినిమాకు హైలెట్ గా నిలిచిందని ఆమె అన్నారు.ఒక్కడు సినిమాలో తనతో పాటు సినిమాలో కనిపించిన స్నేహితులు రియల్ లైఫ్ స్నేహితులని ఆమె వెల్లడించారు.నిహారిక భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు