మహేష్‌ సోదరి నిర్మాతగా సెటిల్‌ అయినట్లేనా?

సూపర్ స్టార్‌ కృష్ణ కుటుంబం నుండి మొదటగా ఆయన సోదరుడు నిర్మాతగా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత రమేష్ బాబు నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

రమేష్ బాబు హీరోగా సెటిల్‌ అవుతాడు అనుకున్న సమయంలో అనూహ్యంగా ఆ సినిమా కేరీర్‌ కాస్త గాడి తప్పింది.ఎంతగా ప్రయత్నించినా కూడా ఫలితం లేదు.

మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అంటూ పేరు దక్కించుకున్నాడు.తండ్రి సూపర్‌ స్టార్‌ కిరీటంను తాను దక్కించుకున్నాడు.

ఆ తర్వాత కృష్ణ ఫ్యామిలీ నుండి చాలా మంది ప్రముఖులు ఎంట్రీ ఇచ్చారు.మహేష్ బాబు సోదరి మంజుల చాలా కాలం క్రితమే నటిగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసి విఫలం అయ్యింది.

Advertisement
Mahesh Babu Sister Galla Padmavathi Going To Produce More Movies Soon Details, G

ఆ తర్వాత ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగే ప్రయత్నం చేసింది.నిర్మాతగా కూడా ఆమె ప్రయత్నించింది.

దర్శకత్వం చేసిన ఆమె సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది.తాజాగా తన కొడుకు సినిమా తో కృష్ణ మరో కూతురు కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

ఇండస్ట్రీలో పద్మావతి గల్లా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఫుల్‌ లెంగ్త్‌ నిర్మాతగా తన కొడుకు హీరో సినిమాకు వ్యవహరించింది.పూర్తి బాధ్యతలు ఆమె తీసుకుని మరీ ఈ సినిమాను చేసింది.

దాంతో భారీ ఎత్తున ఆ సినిమా పై అంచనాలు ఉన్నాయి.

Mahesh Babu Sister Galla Padmavathi Going To Produce More Movies Soon Details, G
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే నిర్మాతగా కృష్ణ కూతురు పద్మావతి ముందు ముందు వరుసగా సినిమా లు తీస్తుందా అనేది చర్చ జరుగుతోంది.ఆస్తి బాగానే ఉంది కనుక ఆమె వందల కోట్ల బడ్జెట్‌ తో కూడా సినిమాలు నిర్మించగలదు.

Advertisement

కనుక మహేష్‌ బాబు తో కూడా పద్మావతి సినిమా లు నిర్మించాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఆ విషయమై గల్లా ఫ్యామిలీ ఏమైనా ఆలోచిస్తుందా అనేది చూడాలి.

తాజా వార్తలు