మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించిన మహేష్.. రియల్ లైఫ్ లో కూడా మహేష్ సూపర్ స్టారేగా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) తనయుడిగా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.

రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు మహేష్ బాబు.కొన్ని వందలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి గొప్ప జీవితాన్ని ఇచ్చారు.

అంతేకాకుండా ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు మహేష్ బాబు.గతంలో చాలామంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Mahesh Babu Provided Financial Support For The Heart Treatment Of A Child, Mahes

తాజాగా కూడా మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నారు మహేష్.మాములుగా గుండె ఆపరేషన్ అంటే చిన్న వ్యవహారం అన్న విషయం తెలిసిందే.అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబు వందల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి గొప్ప మనసు చాటుకుంటున్నారు.

Advertisement
Mahesh Babu Provided Financial Support For The Heart Treatment Of A Child, Mahes

ఈ క్రమంలోనే అనంతపూర్ జిల్లాకి చెందిన నాలుగు నెలల శాన్విక( Shanvika ) గుండెకి రంధ్రం ఉండటంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు.పాపకు సర్జరీ చేయించడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని తల్లిదండ్రులు బాధపడుతున్న సమయంలో మహేష్ బాబు ఫౌండేషన్( Mahesh Babu Foundation ) గురించి డాక్టర్ల ద్వారా తెలుసుకున్నారు.

వెంటనే వారిని సంప్రదించగా పాప గుండె ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారు.

Mahesh Babu Provided Financial Support For The Heart Treatment Of A Child, Mahes

ఈ క్రమంలోనే పాపకు గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు.ఈ సందర్భంగా చిన్నారి తండ్రి సంజీవ రాయుడు( Sanjeeva Rayudu ) మాట్లాడుతూ.మా పాప శాన్విక రాయుడు రెండు నెలలు ఉన్నపుడు ఆనారోగ్యానికి గురైంది.

హాస్పిటల్ కి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి పాపకు గుండెలో హోల్ ఉందని చెప్పారు.అక్కడ నుంచి ఆంధ్ర హాస్పిటల్ కి రిఫర్ చేశారు.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్కలివే.. అంత తీసుకుంటున్నారా?

అప్పటి నుంచి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం.పాపకు సర్జరీ చేయాలని ఖచ్చితంగా చెప్పారు.

Advertisement

కానీ అంత డబ్బు మా వద్ద లేకపోవడంతో ఆందోళన చెందాము.ఆ సమయంలోనే మహేష్ బాబు ఫౌండేషన్ ని సంప్రదించాం.

వారు వెంటనే రెస్పాండ్ అయ్యారు.పాపకు ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేశారు.

మా పాప ప్రాణాలు నిలిపిన మహేష్ బాబు ధన్యవాదాల అని తెలిపారు.తాజాగా మహేష్ బాబు చేసిన పనికి అభిమానులు నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు.

కాగా ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజా వార్తలు