Meenakshi Chaudhary : రామ్ చరణ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన గుంటూరు కారం బ్యూటీ.. ఈమె లక్ మామూలు లక్ కాదంటూ?

హీరోయిన్ మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) గురించి మనందరికీ తెలిసిందే.

మొదట ఇచ్చట వాహనములు నిలుపు రాదు అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ఆ తర్వాత ఖిలాడీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది.అయినా కూడా ఈయనకు సరైన అవకాశాలు రాలేదు.

ఇక అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అయినప్పటికీ ఈ భామకు అనుకున్నంత స్థాయిలో ఛాన్సులు రాలేదు.

ఇక మహేశ్ బాబు గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చాక ఈ భామ ఫేట్ మారిపోయింది.

Advertisement

గుంటూరు కారం( Guntur karaam )లో మొదట హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకున్న సంగతి తెలిసిందే.ఇక ఆమె తప్పుకోవడంతో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.అలా ఈ భామకు మంచి ఛాన్స్ వచ్చింది.

ఇక ఈ ఛాన్సుతో ఆమె స్టార్ హీరోయిన్ క్రేజ్ కొట్టేసింది.ఇటీవల గుంటూరు కారం నుంచి మీనాక్షి చౌదరి లుక్ కూడా బయటకు వచ్చింది.

ఇక ఈ సినిమాలో మహేశ్ బాబుకు మరదలుగా నటించినట్లు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే మహేష్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

గుంటూరు కారం సినిమాలో ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయిందో అప్పటినుంచి ఆమెకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఇదంతా మహేశ్ బాబు క్రేజ్ అంటున్నారు.మహేష్ బాబు హ్యాండ్ పడడం వల్లే మీనాక్షి చౌదరి కెరియర్ గాడిలో పడిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మహేష్ లాంటి స్టార్ హీరో పక్కన అవకాశం దక్కించుకోవడం మామూలు విషయం కాదని నెటిజన్స్ భావిస్తున్నారు.

Advertisement

అయితే ఇలాంటి క్రమంలోని మీనాక్షి చౌదరి మరో జాక్ పాట్ ఆఫర్ అందుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న ఆర్సీ 16 సినిమాలోను సెకండ్ హీరోయిన్ గా ఈ భామ సెలెక్ట్ అయిందట.దీంతో మీనాక్షి చౌదరి బంపర్ ఆఫర్ కొట్టిందని అంటున్నారు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఒక్కొక్కరు ఒక విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు