కళావతి పాటకు మహేష్ బాబు కూతురు స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.ఇందులో మహేష్ బాబు సరసన కీర్తిసురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్,14 రిల్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్ వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇది ఇలా ఉంటే ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదల అయిన ఫస్ట్ లిరికల్ కళావతి సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది.

Advertisement

ఇప్పటికే ఈ సాంగ్ 35 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.అంతేకాకుండా ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.

ఈ పాటకు మహేష్ బాబు వేసిన స్టెప్పులను ఇరగదీశాడు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ పాటకు మహేష్ బాబు కూతురు సితార అదిరిపోయే స్టెప్పులేసింది.

అచ్చం తన తండ్రి లాగే స్టెప్పులను ఇరగదీసింది.అందుకు సంబంధించిన వీడియోని సితార తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇకపోతే మహేష్ బాబు భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి లాంటి సినిమాలతో సూపర్ హిట్ టాక్ ను అందుకొని దూసుకుపోతున్నాడు.ఇక త్వరలో సర్కారు వారి పాట సినిమాతో త్వరలోనే మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది.

Advertisement

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇటీవల మహేష్ బాబు కాలికి దెబ్బ తగిలి సర్జరీ అయిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు