ప్రజా ప్రభుత్వంలో రహదారులకు మహర్ధశ

మాడ్గులపల్లి మండలంలోని 13 గ్రామ పంచాయితీలలో నెలకొన్న సమస్యలు,తక్షణమే చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మండల కాంగ్రెస్ పార్టీ(Congress party) అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్ రెడ్డి (Venugopal Reddy)ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(Battula Lakshmareddy) పుచ్చకాయలగూడెం నుండి మాడ్గులపల్లి వెళ్లే రహదారి ఆగామోత్కూర్ ఆర్ అండ్ బి(R&B) రోడ్డుకి అనుసంధానం చేసే విధంగా బీటీ రోడ్డు మంజూరుకు మూడు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను సిద్ధం చేసి రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) సహకారంతో పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు పంపడం జరిగిందన్నారు.

అదే విధంగా తోపుచర్ల నుంచి సల్కునూర్ వయా మంగాపురం రోడ్డును ఆరు కోట్ల రూపాయలతో విస్తరణ చేయుటకు గాను ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు.మండల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకుడు గడ్డం పురుషోత్తం రెడ్డి, తోపుచర్ల గ్రామశాఖ అధ్యక్షుడు గౌని నిరంజన్, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రామావత్ సైదా,ముకుంద,యాదగిరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

బేబీ జీసస్‌ దొంగలించాడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు!
Advertisement

Latest Nalgonda News