నేను కూడా సాయి పల్లవి కి ఫ్యాన్ అయిపోయా అంటున్న సీనియర్ హీరోయిన్?

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ అమ్మడు హీరోయిన్ అనడం కంటే పక్కింట్లో ఉండే అమ్మాయి అనుకోవాలి.

అవును తెలుగు ప్రేక్షకులందరూ ప్రస్తుతం సాయి పల్లవిని అలాగే భావిస్తున్నారు.ఆమె చేసే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులకు సాయిపల్లవి అంతలా దగ్గర చేస్తుంది.

ఇటీవలి కాలంలో సాయి పల్లవి చేస్తున్న ప్రతి పాత్ర సాయి పల్లవి లోని నటిని మరో మెట్టు ఎక్కిస్తుంది అనే చెప్పాలి.ఇక ఆమె నటనకు ఆమె డాన్సులకు ఆమె హుందాతనానికి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు.

అభిమానించ కుండా ఉండలేక పోతున్నారు.కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం సాయి పల్లవి నటనకు అభిమానులు అయిపోతున్నారూ అని చెప్పాలి.

Advertisement

ఇక నేను కూడా సాయి పల్లవి కి ఫ్యాన్ గా మారిపోయాను అంటూ చెబుతుంది సీనియర్ నటి మధుబాల. ఇటీవలే సాయిపల్లవి నాని కాంబినేషన్ లో రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్.

విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఇటీవల ఓటిటిలో విడుదలై రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.

ఈ సినిమా సినిమాలో దేవదాసి అనే పాత్రలో నటించింది సాయి పల్లవి.నటనతో పాత్రకు ప్రాణం పోసింది అని చెప్పాలి.

ఇకపోతే శ్యామ్ సింగరాయ్ సినిమాపై ఎంతో మంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తూ ఉండగా ఇటీవల సీనియర్ హీరోయిన్ మధుబాల కూడా స్పందించింది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

శ్యామ్ సింగరాయ్ చూశాను.ఇటీవల కాలంలో నేను చూసిన సినిమాల్లో ఇది ఒక అద్భుతమైన సినిమా అంటూ సీనియర్ నటి మధుబాల ట్విట్టర్ వేదికగా తెలిపింది.అంతేకాదు సాయిపల్లవికి బిగ్గెస్ట్ ఫ్యాన్ ని అందంగా ఉంటుంది.

Advertisement

ఆమె అందంగా ఉంటుంది నటన రియలిస్టిక్ గా చేస్తుంది మంచి డాన్సర్ కూడా అంటూ ప్రశంసలు కురిపించింది.ఇక నానీ ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు అంటూ తెలిపింది మధుబాల.

సాయి పల్లవి పై అభిమానాన్ని వ్యక్తపరచడం తో స్పందించిన సాయిపల్లవి మీ మాటలు ప్రేమతో కూడిన కౌగిలిలా ఉన్నాయంటూ ధన్యవాదాలు తెలిపింది.

తాజా వార్తలు