అదృష్టవంతుడు.. అంత ఎత్తునుండి పడ్డా కానీ..?!

మనలో చాలామంది ఒక్కోసారి అనుకోకుండా చావు దగ్గరకు వెళ్లి తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది.అంతగా అనిపించేలా జీవితంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది.

ఆ సందర్భం నుంచి బయటపడ్డాక అబ్బా.తమకి ఇంకా భూమి మీద బతికే ఛాన్స్ ఉందిరా అనుకుంటూ అక్కడి నుంచి బయట పడతాం.

ఇకపోతే ఈ విషయం విన్నాక మనం కూడా అలా అనుకోక తప్పదు మరి.అవును 90 సంవత్సరాలు ఉన్న వృద్ధుడు ప్యారాచూట్ వేసుకొని గాల్లో విహార యాత్రకు బయలుదేరాడు.అది కూడా ఓ నది ఒడ్డు తీరం లో.అయితే అనుకోకుండా ప్యారాచూట్ తెగిపోయి ఆ వ్యక్తి నదిలో పడిపోయాడు.ఆయన కానీ ఆ వ్యక్తి కేవలం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు.వినడానికి నమ్మశక్యంగా లేక పోయినా ఇది నిజం.

అసలు విషయంలోకి వెళితే.ఈ సంఘటన ఆస్ట్రేలియా దేశంలో జరిగింది.

Advertisement

ఆస్ట్రేలియా దేశానికి చందిన 91 సంవత్సరాల వృద్ధుడు ప్యారాచూట్ లో షికారుకి వెళ్ళాగా అనుకోకుండా ఆ ప్యారాచూట్‌ పాడై సిడ్నీ నగరం దగ్గర బీచ్లో కుప్పకూలింది.ఆ పెద్దాయన అంత ఎత్తు నుండి కింద పడిన కూడా బ్రతికి బయట పడడం నిజంగా ఆయన అదృష్టం అని చెప్పాలి.

మామూలుగా ఓ ఎత్తు నుండి కింద పెడితేనే ఏ కాలో, చేయో విరగడం ఖాయం.అలాంటిది ఆ పెద్దాయన కు గాలిలో అంత ఎత్తు నుండి నదిలో పడిన కానీ ఆయన అదృష్టం కొద్దీ ఏలాంటి పెద్ద పెద్ద గాయాలు కాకుండా చిన్న గాయాలతోనే బయటపడ్డాడు.

ఆయన నదిలో పడిపోవడాన్నీ గమనించిన అక్కడి స్థానికులు వెంటనే ఆయన్ని నదిలో నుంచి బయటకు తీశారు.ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.ప్యారాచూట్ లో ప్రయాణించే సమయంలో నుండి నదిలో పడినప్పటికీ ఆయనకు ఎటువంటి ప్రాణహాని కలగలేదని వారు తెలియజేశారు.

అయితే చిన్న చిన్న రాళ్లు తగలడంతో స్వల్ప గాయాలయ్యాయని దాంతో అక్కడే ఉన్న స్థానికులు ఆయన కాలికి కట్టు కట్టారని పోలీసులు తెలిపారు.ఆ తర్వాత అతనికి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ హాస్పిటల్ కు తరలించారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఎంతైనా 90 సంవత్సరాలు పైబడిన ఆ పెద్దాయన కు అంత ఎత్తు నుండి కింద పడినా గాని నిజంగా ఆయన కు ఎంత అదృష్టం ఉంటే మరి బతకగలడు.

Advertisement

తాజా వార్తలు