అంగస్తంభన సమస్యకి సరికొత్త చికిత్స

ఒత్తిడి వల్లో, జీన్స్ వల్లో, చాలామంది మగవారికి అంగస్తంభన సమస్యలు వస్తున్నాయి.అంగం సరిగా గట్టిపడక, సెక్స్ సమస్యలతో సెక్సాలాజిస్టులను సంప్రదిస్తున్నారు వేలమంది.

ఈ అంగస్తంభన సమస్యకు మార్కేట్లో చాలారకాల మందులు దొరుకుతున్నాయి.కాని దురదృష్టవశాత్తు ఆ మందులు అందరి సమస్య తీర్చలేకపోతున్నాయి.

కొందరి శరీరం అంగస్తంభన సమస్య కోసం ఉపయోగించే మందులకు అస్సలు రెస్పాండ్ కూడా అవడం లేదు.ఇలాంటి సమయంలో మరో సరికొత్త చికిత్సతో ముందుకొచ్చారు అమెరికా పరిశోధకులు.

దీని పేరే "లో- ఇంటెన్సిటి షాక్ వేవ్ ట్రీట్‌మెంట్" ఇది ఇంకా పూర్తిగా వాడకంలోకి రాలేదు.ప్రస్తుతం ప్రయోగాలు, చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

ఈ ట్రీట్‌మెంట్ వలన పురుషాంగంలోకి రక్తప్రసరణ బాగా జరిగి, అంగస్తంభనలు బాగా జరుగుతాయని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన టామ్ లూయి తెలిపారు.ఇప్పటివరకు జరిగిన ప్రయోగాలు మంచి ఫలితాలనిచ్చినా, అప్పుడే "లో- ఇంటెన్సిటి షాక్ వేవ్ ట్రీట్‌మెంట్" ని ఒక చికిత్స లాగా వాడకంలోకీ తేలేమని, మరికొన్ని ప్రయోగాల తరువాత, దీంట్లో తీసుకురావాల్సిన మార్పులు తీసుకొచ్చి, అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే వయాగ్రా వాడలేని మగవారికి ఈ ట్రీట్‌మెంట్ గొప్ప వరంలా మారబోతోందని పరోశోధకులు అభిప్రాయపడ్డారు.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు