డెలివరీ తర్వాత సులువుగా బ‌రువు త‌గ్గించే సూప‌ర్ టిప్స్‌!!

త‌ల్లి అవ్వ‌డం అనేది పెళ్లైన ప్ర‌తి మ‌హిళ ఒక వ‌రంలా భావిస్తుంది.

గర్భం పొందిన క్షణం నుండి తొమ్మిది నెలలు నిండి డెలివ‌రీకి వెళ్ళే వరకు ఎన్నో బాధ‌లు, నొప్పులు ఎదుర్కొంటూనే ఉంటుంది.

ఇక డెలివ‌రీ టైమ్‌లో న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నా.కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డను చూడగానే ఆ బాధ‌ల‌న్నీ మర్చిపోతుంది.

అయితే డెలివ‌రీ త‌ర్వాత మ‌హిళ‌ శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.ముఖ్యంగా డెలివ‌రీ త‌ర్వాత మ‌హిళ‌లందరు ఎదుర్కొనే సాధార‌ణ‌, ప్ర‌ధాన స‌మ‌స్య అధిక బ‌రువు.

ఈ క్ర‌మంలోనే బ‌రువు త‌గ్గేందుకు తిన‌డం మాసేసి అనేక ప్ర‌య‌త్నాలు చేసి.ఫ‌లితం లేక భంగ‌ప‌డ‌తారు.

Advertisement

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు.

ఒక క‌ప్పు నీటిలో అర స్పూన్ సోంపు, మ‌రియు రెండు యాల‌కులు వేసి బాగా మ‌రిగించాలి.

అనంత‌రం ఈ నీటిని వడగట్టి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి.ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం డెలివరీ తర్వాత సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు.అలాగే నిద్రలేమి వలన బరువు పెరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా డెలివ‌రీ త‌ర్వాత మ‌హిళ‌లు త‌క్కువ‌గా నిద్ర‌పోతారు.కానీ, రోజుకు క‌నీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంట‌లు ప‌డుకుంటేనే బ‌రువు త‌గ్గ‌గ‌ల‌రు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

అదేవిధంగా, డెలివ‌రీ త‌ర్వాత మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి.రోజుకి కనీసం మూడు లీటర్ల నీరు తాగ‌డం ఖ‌చ్చితంగా బ‌రువు త‌గ్గ‌గ‌ల‌రు.

Advertisement

ప్ర‌తిరోజు క‌నీసం ప‌ది నిమిషాలు అయినా చిన్న చిన్న వర్కౌట్స్ కూడా చేయాలి.అలాగే ప్ర‌తి రోజు ఉద‌యం గోరువెచ్చన నీటిలో తేనె మ‌రియు నిమ్మ‌ర‌సం క‌లిసి తాగాలి.

దీంతో పాటు రోజుకు ఒక క‌ప్పు గ్రీన్ టీ తీసుకోవాలి.ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే మంచి ఫ‌లితం పొందొచ్చు.

తాజా వార్తలు