అధిక బ‌రువు స‌మ‌స్య‌కు చెక్ పెట్టే పిప్ప‌ళ్లు..ఎలా తీసుకోవాలంటే?

అధిక బ‌రువు ప్ర‌స్తుత రోజుల్లో ఎంద‌రి పాలిటో శాపంగా మారిందీ స‌మ‌స్య‌.

జీవ‌న శైలిలో వ‌చ్చే మార్పులు, ఆహార‌పు అల‌వాట్లు, హార్మోన్ ఛేంజ‌స్‌, పోష‌కాల కొర‌త‌, నిద్ర‌ లేమి, ఒత్తిడి వంటివెన్నో బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణాలు అవుతాయి.

అయితే వెయిట్ గెయిన్ అవ్వ‌డానికి కార‌ణాలు అనేకం ఉన్న‌ట్లే.లూస్ అవ్వ‌డానికీ ప‌రిష్కార మార్గాలు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో ఉప‌యోగించే పిప్ప‌ళ్లు అధిక బ‌రువు స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి బ‌రువు త‌గ్గ‌డానికి పిప్ప‌ళ్ల‌ను ఎలా వాడాలి.? అస‌లు పిప్ప‌ళ్ల వ‌ల్ల ఇంకా ఏ ఏ ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.? వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.అధిక బ‌రువు ఉన్న వారు కొన్ని పిప్ప‌ళ్ల‌ను తీసుకుని మ‌ట్టి పాత్ర‌లో లైట్‌గా వేయించి మెత్త‌గా పొడి చేసుకోండి.

ఇప్పుడు అర స్పూన్ పిప్ప‌ళ్ల పొడికి ఇక స్పూన్ తేనె క‌లిపి తీసుకోండి.ఇలా ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం చేస్తే గ‌నుక‌.శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు.

Advertisement

అలాగే ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డే వారు.అర‌ స్పూన్ పిప్ప‌ళ్ల పొడికి ఒక స్పూన్ బెల్లం పొడి క‌లిపి తీసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే జ‌లుబు, గొంతునొప్పి, ద‌గ్గు మ‌రియు శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

అదే స‌మ‌యంలో ఆస్త‌మా ల‌క్ష‌ణాల నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.ఇక ఒక గ్లాస్ గోరు వెచ్చ‌టి నీటిలో పావు స్పూన్ పిప్ప‌ళ్ల పొడి క‌లిపి తీసుకుంటే గ్యాస్‌, అసిడిటీ, ఛాతిలో మంట‌, త్రేన్పులు త‌గ్గుతాయి.

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.శ‌రీరంలో వ్య‌ర్థాల‌న్నీ బ‌య‌ట‌కు పోతాయి.కీళ్ల నొప్పులు, కండ‌రాల వాపులు దూరం అవుతాయి.

మ‌రియు మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డకుండా ఉంటాయి.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు