కాంగ్రెస్ లో మళ్లీ లొల్లి ! రగిలిపోతున్న అసంతృప్తులు 

తెలంగాణ కాంగ్రెస్ లో ( Telangana Congress )ఎప్పటి మాదిరిగానే మళ్లీ లొల్లి మొదలైంది.

ముఖ్యంగా మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత టిక్కెట్ దక్కని నేతలంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు .

మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమను పక్కనపెట్టి,  కొత్తగా పార్టీలో చేరిన వారికి పెద్ద పేట వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలకు గాను,  55 నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది .అయితే ఈ 55 నియోజకవర్గాల్లో కొంతమంది కొత్తవారికి ఇవ్వడం , ఒకే కుటుంబంలో ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వడం , మొదటి నుంచి ఉన్నవారిని పక్కన పెట్టడంపై టికెట్ పై ఆశలు పెట్టుకున్న నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

గజ్వేల్ మెదక్ టికెట్లను వరుసగా తూముకుంట నరసారెడ్డి , మైనంపల్లి రోహిత్ కు కాంగ్రెస్ కేటాయించింది .దామోదర రాజనర్సింహ సంగారెడ్డి  , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కి సంగారెడ్డి,  జహీరాబాద్ కు మాజీమంత్రి చంద్రశేఖర్ ను ప్రకటించింది.  తొలి విడతలో ఉమ్మడి జిల్లాలో ఐదు అభ్యర్థిత్వలను కాంగ్రెస్ ఖరారు చేసింది.

ఈ ప్రకటన తర్వాత టిక్కెట్ ఆశించి బంగపడిన నేతలు అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.గజ్వేల్ టికెట్ తూముకుంట నరసారెడ్డి,  పిసిసి డెలిగేట్ సభ్యుడు జస్వంత్ రెడ్డి ఆశించారు.

Advertisement

నర్సారెడ్డికి టికెట్ దక్కడంతో జస్వంత్ వర్గం తీవ్రంగా రగిలిపోతోంది .నరసారెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ గతంలో గాంధీభవన్ ను ముట్టడించి ధర్నా సైతం నిర్వహించారు .ప్రస్తుత పరిణామాలపై జస్వంత్ రెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది .ఇక మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ మైనంపల్లి రోహిత్ కు కేటాయించబోతున్నారు అనే సమాచారంతో జిల్లాకు చెందిన ముఖ్య నేతలుగా ఉన్న డిసిసి అధ్యక్షుడు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి,( Kantareddy Tirupati Reddy ) మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి  పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు .మిగతా ముఖ్యమైన నేతల్లో ఒకరైన పిసిసి అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ సైలెంట్ గా ఉన్నారు .

మైనంపల్లి రోహిత్ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటుండడం పై పార్టీలో చర్చనీయంశం గా మారింది .సుప్రభాత రావుకు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సముచితస్థానం కల్పిస్తామని సి డబ్ల్యూ సి సభ్యులు దామోదర రాజనర్సింహ భరోసా ఇవ్వడంతో రోహిత్ కు ఆయన మద్దతు పలుకుతున్నారు .ఇక జహీరాబాద్ అభ్యర్థిత్వం చంద్రశేఖర్ కు ఖరారు చేయగా,  ఇదే స్థానం కోసం దరఖాస్తు చేసుకున్న నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.నారాయణఖేడ్ లో మాజీ ఎంపీ సురేష్ శెట్కర్,  సంజీవరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు .నరసాపూర్ లో గాలి అనిల్ కుమార్ , ఆవుల రాజిరెడ్డి , పఠాన్ చెరువులో కాటా శ్రీనివాస్ గౌడ్ , గాలి అనిల్ ఇద్దరు టికెట్ కోరుతున్నారు .దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ( Srinivas Reddy Cheruku ) శ్రవణ్ కుమార్ రెడ్డి , కత్తి కార్తీక పోటీ పడుతున్నారు.సిద్దిపేటలో నూ ఓ ఇద్దరు నాయకులు టికెట్ కోసం గట్టిగానే పోటీ పడుతున్నారు.

ఇక కాంగ్రెస్ రెండో జాబితా విడుదలైన తరువాత రాష్ట్రవ్యాప్తంగా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు