బద్వేల్ నియోజకవర్గం ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు...!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) పాదయాత్ర రాయలసీమలో సాగుతున్న సంగతి తెలిసిందే.

సీమలో పాదయాత్ర చివరి దశకు చేరుకోవటంతో బద్వేల్ నియోజకవర్గంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఈ సందర్బంగా రైతులతో మాట్లాడుతూ వైసీపీ( YCP ) పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు పెరిగాయని లోకేష్ విమర్శించారు.డ్రిప్ ఇరిగేషన్ పై రాయితీ ఎత్తేసి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు.

ఇదే సమయంలో 49 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన రాయలసీమకు( Rayalaseema ) జగన్ ఏం చేశారని ప్రశ్నించారు.అవే సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని లోకేష్ తెలియజేయడం జరిగింది.

దాదాపు నెల రోజులకు పైగా రాయలసీమ ప్రాంతంలో లోకేష్ పాదయాత్ర సాగింది.

Advertisement

ఈ క్రమంలో "మిషన్ రాయలసీమ"( Mission Rayalaseema) పేరిట.వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మేనిఫెస్టోలో ప్రత్యేకమైన హామీలు కేటాయిస్తామని తెలియజేయడం జరిగింది.ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎండలు మండిపోతు ఉండటంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో సోమవారం స్కూల్స్ తెరవటంపై లోకేష్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.

పాఠశాలలకు సెలవులు పొడిగించాలని.తల్లిదండ్రుల అభిప్రాయం కూడా ఇదేనని లోకేష్ తెలియజేయడం జరిగింది.మరోపక్క రేపటి నుంచి పాఠశాలలు పున్న ప్రారంభించాలని ఈనెల 17వ వరకు ఒక పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది.

మరోపక్క మాత్రం వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు.సెలవుల పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు