లోకేష్ కు ఇక చెడుగుడే ? అక్కడ వైసీపీదే రాజ్యం ? 

పప్పు .

మాలోకం, ఇంకా నోటికి ఏది వస్తే ఆ పేర్లతో రకరకాలుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసిపి నాయకులు తీవ్ర స్థాయిలో ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు.

వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలతో పాటు, టిడిపి, జనసేన కు చెందిన ఎమ్మెల్యేలు కొంత మంది మద్దతు పలుకుతుండడంతో వైసీపీదే ఇష్టారాజ్యంగా ఉంది.దీంతో ఆ స్థాయిలో లోకేష్, చంద్రబాబు పైన విరుచుకుపడుతూ ఉంటారు.

ఇక వైసీపీ ప్రభుత్వం పై లోకేష్ సైతం అంతే స్థాయిలో విమర్శలు చేసినా, వైసిపి నాయకులు ముందు అది తేలిపోతోంది.అయినా తన శక్తికి మించి లోకేష్ పోరాడుతూనే ఉన్నారు.

వైసిపి ఎంతగా హడావుడి చేసినా శాసనమండలి విషయానికి వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీదే హవా గా ఉండేది.టిడిపికి చెందిన ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉండడం, మండలి చైర్మన్ సైతం టిడిపికి చెందిన వ్యక్తి కావడంతో వైసిపి బయట ఎంతగా హడావుడి చేసినా శాసనమండలిలో టిడిపిదే పైచేయిగా ఉంటూ వచ్చింది.

Advertisement

కీలకమైన ఎన్నో బిల్లులు శాసనసభలో ఆమోదం పొందినా, మండలిలో మాత్రం టిడిపి వాటిని అడ్డుకుంటూ వచ్చేది.ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, మూడు రాజధానులతో పాటు, ఎన్నో కీలకమైన బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి.

ఆ విధంగా మండలిలో లోకేష్ తన ప్రతాపం చూపించేవారు.దీంతో అసలు మండలినే రద్దు చేసేందుకు జగన్ ప్రయత్నించినా, అది వర్కౌట్ కాలేదు.

  కాకపోతే ఇప్పుడు శాసనమండలిలో వైసిపి బలం పెరిగింది.

మండలి చైర్మన్ గా వైసీపీ నేత రాబోతున్నారు.దీంతో ఇక లోకేష్ హవా ముగిసినట్టే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఖచ్చితంగా మండలిలో లోకేష్ ను టార్గెట్ చేసుకుని వైసిపి చెడుగుడు ఆడుకునేలా కనిపిస్తోంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

బయట ప్రభుత్వంపై ఎంతగా విమర్శలు చేసినా, మండలిలో అనేక అంశాలలో లోకేష్ ను ఇరుకున పెట్టొచ్చు అనేది వైసిపి అభిప్రాయంగా కనిపిస్తోంది.ఎలాగూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న వైసీపీ మంత్రులు మండలి లో లోకేష్ కు గట్టి కౌంటర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు