Lion Baboon : రివెంజ్ అంటే ఇదే కదా.. బబూన్ కోతికి కోలుకోలేని షాకిచ్చిన సింహం

మనిషి ఎంత బలహీనుడైనా తన కుటుంబంపైనా, ఇంటిపైనా ఎవరైనా దాడి చేస్తే ఊరుకోడు.తన శక్తినంతా కూడగట్టుకుని ప్రత్యర్థులపై దాడి చేస్తాడు.

ఇదే లక్షణం కోడిలో కూడా కనిపిస్తుంది.తన పిల్లల జోలికి ఎవరైనా వస్తే, అది ఎగిరి మరీ తన్నుతుంది.

అలాంటిది అడవికి రాజైన సింహం( Lion ) పిల్లల జోలికి ఎవరైనా వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఊహించడమే కష్టం.అయితే తుంటరితనానికి మారు పేరు అయిన కోతి( Monkey ) తన పిల్లల జోలికి రావడంతో సింహం రివెంజ్ తీర్చుకుంది.

ఎంతలా అంటే జీవితంలో మరలా ఎప్పుడైనా తనపై కానీ, తన పిల్లలపై కానీ దాడి చేయాలంటేనే భయపడేంతగా షాకిచ్చింది.ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Lion Taking Revenge On Baboon Video Viral On Social Media-Lion Baboon : రి�

కోతి తొలుత ఆ సింహాన్ని కవ్వించడమే తప్పు అని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి తెలుసుకుందాం.

Lion Taking Revenge On Baboon Video Viral On Social Media

అడవిలో సింహానికి ప్రతి జీవితో ఏదో ఒక సందర్భంలో శతృత్వం ఉంటుంది.ఈ జాతి వైరం వల్ల సింహానికి మిగిలిన జంతువులన్నీ భయపడుతుంటాయి.ఇక తనకు ఆకలి వేసిందంటే ఎలాంటి జీవిని అయినా సింహం వదిలి పెట్టదు.

వేటాడి ఆ జీవులను చంపి తింటుంది.అలా తన ఆకలి తీర్చుకుంటుంది.

ఇలాంటి కౄరమైన సింహం జోలికి ఓ బబూన్ కోతి( Baboon ) వెళ్లింది.సాధారణంగా కోతులు బలమైన సింహాల జోలికి వెళ్లవు.

దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి... వీడియో చూస్తే గుండెలు గుభేల్!
ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్

వృద్ధ సింహాలు, చిన్న వయసులో ఉండే సింహం పిల్లలను మాత్రం కవ్విస్తాయి.వాటిపై దాడి చేస్తాయి.

Advertisement

ఇలాంటి పని పెద్ద సింహాల పట్ల చేస్తే ఆ కోతులు ప్రాణాలు కోల్పోతాయి.

ఇదే కోవలో ఓ బబూన్ కోతి చెట్టు కింద ఉన్న ఓ సింహం పిల్లపై( Lion Cub ) దాడి చేసింది.దానిని తన గోళ్లతో రక్కింది.ఆ సమయంలో సింహం తల్లి అక్కడ లేదు.

అయితే తన పిల్లను బబూన్ కోతి ఏడిపించడం, దాడి చేయడం సింహం దూరం నుంచి చూసింది.దీంతో అక్కడికి పరుగు పరుగున వచ్చింది.

ఇక ఆ సింహాన్ని చూసి బబూన్ కోతి తన పిల్లతో సహా చెట్టు ఎక్కింది.అయినప్పటికీ సింహం దానిని విడిచి పెట్టలేదు.

చెట్టు చివరి కొమ్మ వరకు బబూన్ కోతి ఎక్కగా, దాని వెంటే సింహం కూడా వెళ్లింది.చివరికి చెట్టు పై నుంచి ఆ బబూన్ కోతి దూకేసింది.

అయితే దాని పిల్లను మాత్రం ఆ సింహం వేటాడి, చంపి తినేసింది.ఇలా తన పిల్లల జోలికి వస్తే తాను ఎలా రివెంజ్ తీర్చుకుంటుందో ఆ సింహం ఇలా చేసి చూపించింది.

తాజా వార్తలు