వామ్మో.. ఈ టెక్నిక్‌తోనే సైబర్‌ నేరగాళ్లు మీ డబ్బుల్ని దోచేస్తారట!

సాధారణంగా మన బ్యాంకు ఓటీపీని షేర్‌ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురవుతుంది.ఎందుకంటే మొబైల్‌ నంబుర్‌ బ్యాంకులతో రిజిస్టర్‌ అయి ఉంటుంది.

అందుకే బ్యాంకులు ఇతర ఫైనాన్షిషల్‌ సంస్థలు తమ కస్టమర్లను ఎప్పటికప్పుడు అలెర్ట్‌ చేస్తూనే ఉంటారు.తమ మొబైళ్లకు వచ్చిన ఓటీపీలను ఎప్పుడూ షేర్‌ చేయకూడదని.

ఎవరైనా కేవైసీ అప్డేట్‌ అంటూ ఫోన్‌ చేసినా జాగ్రత్త వహించాలి.అందుకే ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ను బ్యాంకులో రిజిస్టర్‌ చేసి ఉండాలి.

తద్వారా మీకు తక్షణమే మీ లావదేవీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ల అలెర్ట్‌ వస్తుంది.బ్యాంకుల వినియోగదారులకు ఎందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకోమంటారంటే.

Advertisement
Like This Scammers Theft Your Money From Banks, Beware Of Credit And Debit Card

సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాలో అమాయకపు కస్టమర్ల జేబులకు ,చిల్లు పెట్టడానికి గోతి కాడి నక్కలాగా కాచుకుని ఉంటారు.ఈ రోజుల్లో ఎస్‌ఎంఎస్‌ స్పూఫింగ్‌ విపరీతంగా పెరిగింది.

ఎస్‌ఎంఎస్‌ పంపించిన వ్యక్తి పేరును మార్చి ఉంటుంది.అంటే బ్యాంకు నుంచి లేదా ఇతర మనకు సంబంధించిన ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి పంపినట్లుగా ఉంటుంది.

మనం అంత సులభంగా గుర్తుపట్టలేం.దీన్నే ఎస్‌ఎంఎస్‌ స్పూఫీంగ్‌ అంటారు.

ఎస్‌ఎంఎస్‌ స్పూఫ్‌ పనితీరు.

సైబర్‌ నేరగాళ్లు మీకు ఓ ఎస్‌ఎంఎస్‌ను పంపిస్తారు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?

దీన్ని మీరు ఇతరులకు ఫార్వర్డ్‌ చేయమని అంటారు.అది కేవలం మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ద్వారా చేయాల్సి ఉంటుంది.

Advertisement

మీరు ఎస్‌ఎంఎస్‌ పంపించిన వెంటనే స్కామర్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ యూపీఐ ద్వారా మొబైల్‌ నంబర్‌ లేదా లింక్‌ చేసేసుకుంటారు.

దీంతో మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు సేకరించడానికి తరచూ ఫోన్‌ చేస్తూ ఉంటారు.అంటే డెబిట్‌ కార్డు, ఏటీఎం పిన్, ఎక్స్‌పైరీ డేట్‌ ఆఫ్‌ డెబిట్‌ కార్డు, ఓటీపీ.ఈ పర్సనల్‌ వివరాలతో వారికి మొబైల్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ లేదా ఎంపిన్‌ తెలిసిపోతుంది.

ఈ ఎంపిన్‌ ద్వారానే బ్యాంకు లావదేవీలు నిర్వహించడానికి స్కామర్లకు సులభం అవుతుంది.కొన్నిసార్లు స్కామర్స్‌ మీ యూపీఐ ఐడీకి ‘కలెక్ట్‌ రిక్వెస్ట్‌’ను ధ్రువీకరించమంటారు.రిఫండ్‌ ఫెయిల్‌ అయిందని మిమ్మల్ని న మ్మిస్తారు.

దీంతో కూడా మీ ఖాతాలోని డబ్బులకు గండిపడుతుంది.

తాజా వార్తలు