లైగర్ హంగామా మామూలుగా లేదు.. పాలాభిషేకాలతో సందడి చేస్తున్న ఫ్యాన్స్?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం లైగర్.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

వచ్చేనెల 25వ తేదీ ఈ సినిమా విడుదల కానుండడంతో పెద్ద ఎత్తున సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచారు.ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అభిమానులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది.

ఇక ఈ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ చేతుల మీదుగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు.ఇకపోతే ఈ ట్రైలర్ ను హైదరాబాదులో సుదర్శన్ థియేటర్లో విడుదల చేయడం విశేషం.ఇక ఈ థియేటర్లో ట్రైలర్ విడుదల కానుందని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ వద్ద సందడి చేస్తున్నారు.75 అడుగుల విజయ్ దేవరకొండ కటౌట్ ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున పూలమాలలతో పాలాభిషేకాలు చేస్తూ, టపాకాయలు కాలుస్తూ అభిమానులు సందడి చేస్తున్నారు.ఇలా తమ అభిమాన హీరో సినిమా నుంచి ట్రైలర్ విడుదల కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు.

Liger Trailer Launch Hungama Vijay Devarakonda Fans Video Viral On Internet Deta

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, ఫస్ట్ గ్లిప్ పెద్ద ఎత్తున సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది.ఏది ఏమైనా ఒక హీరో సినిమా నుంచి ట్రైలర్ ఈ స్థాయిలో విడుదల కావడంతోనే ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ రానుందో తెలుస్తుంది.

Advertisement
Liger Trailer Launch Hungama Vijay Devarakonda Fans Video Viral On Internet Deta

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు