Rajiv Gandhi : జీవిత ఖైదీ ముద్దాయిలు విడుదల..ఇది న్యాయమేనా ?

రాజీవ్ గాంధీ హంతకులుగా నిర్దారించబడి జీవిత ఖైదు అనుభవిస్తోన్న ఏడుగురు ముద్దాయిలను సుప్రీం కోర్టు విడుదల చేయడం విశేషం.

వారు మూడు దశాబ్దాలుగా జైలు శిక్ష ననుభవిస్తూ రావడం,వారి క్షమాబిక్ష కై రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని అక్కడి గవర్నర్ ఎక్కువ కాలం సాగదీయడం వాటిపై వారు అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లడం జరిగింది.

తొలుత అందులో మొదటిగా పెరారివలన్ ని విడుదల చేస్తూ,తర్వాత మిగిలిన ఆరుగురికీ అదే న్యాయం,అదే తీర్పుని వర్తింపజేసింది.అందులో నలుగురు మరణశిక్షను జీవిత ఖైదీగా మార్చబడ్డవారైతే,మిగిలిన ముగ్గురూ అదే శిక్ష అనుభవిస్తున్న వారు.

రాజీవ్ గాంధీ ని మట్టుబెట్టే కుట్ర తెలిసిన వారు.తెలిసీ పాల్గొన్నవారు.

నేరం నిరూపితమై శిక్ష అనుభవిస్తున్నవారు దేశ నేతని హత్య చెయ్యడమే కాకుండా పదుల సంఖ్యలో ప్రాణాలు తీసిన తీవ్రవాద ఘాతుకంలో పట్టుబడి,క్రింది కోర్టులో రుజువు కాబడ్డ 26 మందిలో చివరకు ఏడుగురు జైలులో ఉన్నారు.

Advertisement

ఇప్పుడు ఏడుగురు ముద్దాయిలను విడుదల చెయ్యడం మన న్యాయవ్యవస్థ పనితీరులో అద్వితీయ ధోరణి ని పట్టి చూపుతుంది.జీవిత ఖైదు నుండి దీర్ఘకాలం తర్వాత స్వేచ్ఛ నివ్వడం మానవత్వమే కానీ తీవ్రవాదం లాంటి హీన నేరాలకు అది వర్తించ వచ్చా? ఆ మధ్య గుజరాత్ ప్రభుత్వం ఒక సామూహిక మానభంగం,హత్య కేసుల్లో ముద్దాయిలకు కూడా స్వేచ్ఛనిచ్చింది.ముద్దాయిలకు,నేరం రుజువు కాబడి శిక్షలో ఉన్నవాళ్లకు ఉపశమనం కలిగించే పెద్ద మనస్సుగల వ్యవస్థ మరోవైపు విచారణకు కూడా నోచుకోని చిన్నచిన్న నేరాల్లోని అనుమానితుల్ని, నిందితుల్ని జైళ్లలో మగ్గేలా చూడడం కరెక్టేనా?అలాంటి వారు లక్షల్లో ఉండడం మరీ అన్యాయం.న్యాయం అందరికీ ఒకేలా అమలు కాకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు.

అయితే ఆ లోపాల్ని దిద్దుకోలేకపోతే అది న్యాయం కాదు.సత్వర న్యాయం సరైన న్యాయం అందించడానికి అవసరమైన సంస్కరణలు పాలనా వ్యవస్థలో,న్యాయవ్యవస్థలో అవసరం.

Advertisement

తాజా వార్తలు