ఆ డైరెక్టర్ల సినిమాలలో కథ ఏమీ ఉండదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాఘవ లారెన్స్!

సౌత్ ఇండస్ట్రీలో సినీ నటుడిగాను దర్శకుడిగాను కొరియోగ్రాఫర్ గాను ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు రాఘవ లారెన్స్(Raghava Lawrence) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నటుడిగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి లారెన్స్ తాజాగా చంద్రముఖి 2 (Chandramukhi 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా చంద్రముఖి సినిమా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.

ఇలా చంద్రముఖి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన త్వరలోనే మరొక సినిమాను ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా రాఘవ లారెన్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, (Lokesh Kanagaraj) నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Deelip Kumar) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇద్దరి డైరెక్టర్లు సంచలనమైనటువంటి విజయాలను సొంతం చేసుకుని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈ డైరెక్టర్లతో సినిమాలు చేయాలని ఎంతో మంది హీరోలు కూడా ఎదురుచూస్తున్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఈ డైరెక్టర్ల సినిమా గురించి లారెన్స్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నెల్సన్ దిలీప్ కుమార్ లోకేష్ దర్శకత్వంలో వచ్చే సినిమాలలో స్క్రిప్ట్ పెద్దగా ఉండదని ఈయన తెలిపారు.వీరిద్దరూ రొటీన్ కథతోనే సినిమాలు చేస్తారని లారెన్స్ కామెంట్స్ చేశారు అయితే వీరి సినిమాలో సక్సెస్ అవ్వడానికి కారణం స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉండటంతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ లను భారీగా తెరకెక్కించేందుకు ఇష్టపడతారని అదే వారి సినిమాలను విజయ బాటలో నడిపిస్తాయని లారెన్స్ వెల్లడించారు.ఇక జిగర్‌తాండ డబుల్ ఎక్స్( Jigarthanda Double X ) సినిమాతో తాను వారి స్టైల్‌నే ఫాలో కాబోతున్నట్లు లారెన్స్ చెప్పాడు.

Advertisement

ఈ సీక్వెల్ ద్వారా మీరంతా సరికొత్త లారెన్స్ ను చూడబోతున్నారంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు