Singer Damini: బిగ్ బాస్ దామిని అమ్మానాన్నలతో కలిసి ఉండకపోవడానికి అసలు కారణం ఇదేనా?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ సింగర్ దామిని( Singer Damini ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందే ఈమె సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది.

తెలుగులో ఎన్నో సినిమాలకు పాటలు పాడి ఫిమేల్ సింగర్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.చాలా సందర్భాలలో బుల్లితెర పై ప్రసారం అవ్వుతున్న కామెడీ షోలకు కూడా ఎంట్రీ ఇచ్చి లైవ్ లో కూడా ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది.

ఇక ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.కానీ ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

బిగ్ బాస్ హౌస్కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది దామిని.కానీ హౌస్ లో కొన్ని సందర్భాల్లో ఆటల వల్ల అలా ప్రవర్తించి ఆమె కాస్త నెగిటివిటిని కూడా కూడగట్టుకుందని చెప్పవచ్చు.

Advertisement

ఇక బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత దామిని( Damini ) వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన ఫ్యామిలీతో( Damini Family ) తన దూరంగా ఉండని గల కారణాలను వెల్లడించింది.

ఇంటర్వ్యూలో భాగంగా దామిని మాట్లాడుతూ.నాకు దైవభక్తి ఎక్కువే అందుకే నేను ఎక్కువగా దేవుళ్ళను పూజించడం దేవాలయాలను సందర్శించడం చేస్తుంటాను.

అది కూడా గుడిలో ప్రశాంతత ఉంటేనే నేను గుళ్ళకు వెళ్తాను అని తెలిపింది దామిని.

అనంతరం యాంకర్ మీరు మీ అమ్మానాన్నలతో కలిసి ఉండకపోవడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించగా.నాకు ప్రస్తుతం 29 సంవత్సరాలు.నేను నాకు 28 ఏళ్లు వచ్చే వరకు కూడా నా ఫ్యామిలీతోనే కలిసి ఉన్నాను.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

నేను మా అక్క కూడా ఇద్దరం కలిసి ఒకే బెడ్ రూమ్ లోనే ఉండే వాళ్ళం.కానీ ఎప్పుడూ ఒకటే విధంగా ఉండకుండా బయట ప్రపంచాన్ని తెలియాలి అంటే కొంచెం మారాలి.

Advertisement

అన్నింటిని అలవాటు చేసుకోవాలని అనిపించింది.

అందుకే నేను మా అమ్మ నాన్న ఒప్పించి నేను కొద్ది రోజులు బయటికి వెళ్తాను.బయట ఒంటరిగా ఒక ఇల్లు తీసుకుని ఉంటాను.నాకు సంబంధించిన ప్రతి ఒక ఖర్చులు నేనే భరించుకుంటాను అని చెప్పి ఇంట్లో వాళ్ళ నుంచి కొంచెం దూరం వచ్చాను అంతే.

కానీ ప్రస్తుతం సమాజంలో మాత్రం దానిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు.కానీ వాళ్లు అనుకుంటున్నట్టుగా ఏమీ జరగలేదు నేను మా అమ్మ నాన్న అంగీకారంతోనే బయటకు వచ్చి స్వతంత్రంగా ఒక ఇంటిని నేను మైంటైన్ చేయగలనా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి మాత్రమే బయట ఉంటున్నాను అని తెలిపింది దామిని.

తాజా వార్తలు