చలికాలంలో మీ జుట్టు మరింత అధికంగా రాలుతుందా.? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా హెయిర్ ఫాల్( Hair fall ) కు అడ్డకట్ట వేయలేకపోతున్నారా.? టెన్షన్ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే ఊడిన జుట్టు కూడా మళ్లీ వస్తుంది.
చలికాలంలో హెయిర్ ఫాల్ సమస్యను నియంత్రించడానికి ఈ రెమెడీ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు,( Flax Seeds ) రెండు రెబ్బలు కరివేపాకు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్, వన్ టేబుల్ స్పూన్ శీకాకై పౌడర్ వేసుకోవాలి.
ఆ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ జ్యూస్( Onion juice ) మరియు తయారు చేసి పెట్టుకున్న వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ మిరాకిల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మీ జుట్టు ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదుఈ రెమెడీతో మీ జుట్టు కుదుళ్లు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.
అలాగే ఈ రెమెడీ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.ఫలితంగా కురులు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతాయి.ఊడిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది.అలాగే ఉల్లి రసం చుండ్రు సమస్య( Dandruff problem )ను దూరం చేస్తుంది.
అవిసె గింజలు జుట్టును సిల్కీగా హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.కాబట్టి చలికాలంలో ఆరోగ్యమైన ఒత్తైన పొడవాటి కురులను కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.