ఉన్నావ్ అత్యాచార కేసులో బిజెపి ఎమ్మెల్యే దోషిగా తేల్చిన కోర్టు

ఉత్తరప్రదేశ్లో ఉన్నావ్ లో జరిగిన మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే.ఇక ఈ అత్యాచారం ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చి తీర్పు చెప్పింది.

2017 లో మైనర్ బాలికకి ఉద్యోగం ఇప్పిస్తానని స్థానిక ఎమ్మెల్యే అయిన కులదీప్ సింగ్ తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు.ఆ తరువాత కొంత మంది ఆమెని కిడ్నాప్ చేసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

అయితే ఆ విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే తన అనుచరులను పంపించి ఆమె తండ్రిపై తీవ్రంగా దాడి చేశారు.అక్రమ ఆయుధాల కేసులో అరెస్టు దారుణంగా చిత్రహింసలకి గురిచేసారు.

దీంతో అతను స్టేషన్ లో ఉండగానే చనిపోయాడు.తండ్రి చావుకు కారణమై, తన అత్యాచారం చేసిన ఎమ్మెల్యే మీద కోపంతో బాధితురాలు ఎమ్మెల్యే ఇంటిముందు ఆత్మహత్యాయత్నం చేసింది.

Advertisement

దీంతో ఒక్కసారిగా యూపీలో ఈ సంఘటన సంచలనంగా మారింది.మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలవడంతో యూపీ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది.

అప్పటికే బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ ని పార్టీ బహిష్కరించింది.దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

తరువాత ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నంలో ఎమ్మెల్యే అనుచరులు బాధితురాలిని హత్య చేసే ప్రయత్నం చేశారు.ఈ ఘటనలో ఆమె బంధువులు ఇద్దరు చనిపోయారు.

ఆమె తరఫున సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వారిని కూడా భయపెట్టారు.ఇదిలా ఉంటే ఈ కేసుపై ఢిల్లీ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..

కుల్దీప్ సింగ్ ని దోషిగా తేల్చింది.ఇక అతనికి ఈ నెల 19న శిక్ష ఖరారు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు