టాలీవుడ్ లో నటనకు రూపం అంటే ఆ హీరోనే.. ఆ హీరోకు ఈక్వల్ ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో నంబర్ వన్ అని చెబితే ఇతర హీరోల ఫ్యాన్స్ ఫీలవుతారు.

వేర్వేరు అంశాల విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వేర్వేరు హీరోలు నంబర్ వన్ స్థానంలో ఉన్నారు.

కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నోబుల్ అనే వ్యక్తి నాకు సీనియర్ అని ఆ సమయంలో బాగా యాక్టివ్ గా ఉండేవాళ్లమని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.ఆ వ్యక్తి పరుచూరి గోపాలకృష్ణ దగ్గర చదువుకున్నాడని కృష్ణవంశీ తెలిపారు.

ప్రస్తుతం దర్శకుడు, కథకుడు ఒకరే అయిపోయారని ఆయన అన్నారు.స్క్రీన్ ప్లేలో అన్నీ డిసైడ్ అవుతాయని దర్శకుడు ఫిజికల్ గా స్క్రీన్ ప్లే ను ఎగ్జిక్యూట్ చేస్తాడని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.

అన్ని విషయాల గురించి అవగాహన ఉండాలని ఆయన కామెంట్లు చేశారు.యంగ్ డైరెక్టర్లలో చాలామంది అద్భుతమైన ఐడియాలతో వస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

కనీసం ఐదేళ్లపాటు అసిసెంట్ డైరెక్టర్ గా అనుభవం ఉండి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.త్వరగా డైరెక్టర్ కావాలని అనుకోవద్దని కృష్ణవంశీ పేర్కొన్నారు.

ఇతరుల తప్పుల ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చని ఆయన తెలిపారు. రంగమార్తాండ సినిమా బాగా వచ్చిందని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.

తిండి చుట్టూ ఉండే మాఫియా గురించి అన్నం సినిమాలో ప్రస్తావించనున్నామని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.పాన్ ఇండియా అనేది బిజినెస్ వ్యవహారం అని ఆయన వెల్లడించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పర్ఫామెన్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.నటనకు రూపం అంటే ఎన్టీఆర్ అని చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.అంతే ఈక్వల్ గా మహేష్ బాబు ఉంటారని ఆయన కామెంట్లు చేశారు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

కృష్ణవంశీ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు