రేపు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు

దివికేగిన టాలీవుడ్ దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు రేపు మహా ప్రస్థానంలో జరగనున్నాయి.

ముందుగా ఎల్లుండి నిర్వహిస్తామన్న కుటుంబ సభ్యులు కొన్ని కారణాల చేత రేపే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో ఇప్పటికే నానక్ రామ్ గూడ నివాసానికి కృష్ణ భౌతికకాయాన్ని తరలించారు.సాయంత్రం 5 గంటల వరకు ఆయన పార్థివదేహాన్ని నివాసం వద్ద ఉంచనున్నారు.

అనంతరం అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియానికి భౌతికకాయాన్ని తరలించనున్నారు.రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు గచ్చిబౌలి స్టేడియంలో భౌతికకాయాన్ని ఉంచనున్నారు.

రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయని వెల్లడించారు.

Advertisement
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు