‘డిక్టేటర్‌’ను లేపేస్తున్నాడు

బాలకృష్ణ 98వ సినిమా ‘లయన్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.‘లయన్‌’ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

దాంతో తన తర్వాత సినిమా ‘డిక్టేటర్‌’పై బాలయ్య మరింతగా శ్రద్ద పెట్టాడు.‘లౌక్యం’ ఫేం శ్రీవాస్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘డిక్టేటర్‌’ సినిమా మే 29న ప్రారంభం కాబోతుంది.

ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లుగా శ్రీవాస్‌ ప్రకటించాడు.ఈ సినిమాకు కోన వెంకట్‌ మరియు గోపీమోహన్‌లు స్క్రిప్ట్‌ను అందించారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోన వెంకట్‌ మరియు గోపీమోహన్‌లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.వీరు స్క్రిప్ట్‌ అందించిన పలు సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి.

Advertisement

ఈ రచయితల ద్వయం మొదటి సారి బాలకృష్ణ కోసం ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేశారు.మొదటి సారి అవ్వడంతో ఎక్కువ ఫోకస్‌ పెట్టి మరీ బాలయ్య బాబు ఇమేజ్‌కు తగ్గ కథను సిద్దం చేశారట.

ఈ సినిమా గురించి కోన వెంకట్‌ మాట్లాడుతూ.బాలయ్య కెరీర్‌లోనే ది బెస్ట్‌ సినిమాగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఎంతో శ్రమకు ఓర్చి ఈ కథను తయారు చేశామని అన్నాడు.16 సంవత్సరాలుగా బాలయ్యతో స్నేహం ఉంది.కాని ఇప్పటి వరకు ఆయన సినిమాకు పని చేసే అవకాశం రాలేదు.

అది ఇన్నాళ్లకు వచ్చినందుకు సద్వినియోగం చేసుకున్నాను అంటూ కోన వెంకట్‌ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకు వెళ్తున్నాడు.

వయస్సు 93 , 107 మంది భార్యలు... 185 మంది సంతానం... ఆయన అంతమందిని పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తెలుసా

Advertisement

తాజా వార్తలు