చాలా కాలంగా కమెడియన్‌గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న శ్రీనివాస్‌రెడ్డి హీరోగా మారేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.గత సంవత్సరం ‘గీతాంజలి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు హీరోగా వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో సినిమాలో హీరోగా నటించేందుకు సిద్దం అవుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్న ఈ సినిమా కామెడీ ప్రధానంగా సాగనుందని తెలుస్తోంది.
శ్రీనివాస్‌రెడ్డి హీరోగా అలరించాలని చాలా కాలంగా కోరుకుంటున్నాడు.తాజాగా ఆయన నటించిన ‘గీతాంజలి’కి మంచి రెస్పాన్స్ రావడంతో పూర్తి స్థాయి హీరోగా నటించినా కూడా ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకంతో ఈయన ఉన్నట్లుగా తెలుస్తోంది.
అందుకే తన సన్నిహితుడితో కలిసి స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.హీరోగా నటిస్తూనే ఇతర సినిమాల్లో కామెడీ పాత్రలు పోషించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ఈయన ప్రకటించాడు.
మరి ఈయన చేస్తోన్న మరో ప్రయత్నం సఫలం అయ్యేనో చూడాలి.







