ఆ సినిమా కోసం కాఫీ బాయ్ గా మారాను : కోన వెంకట్

కోనా వెంకట్.సినిమా పైన ఎంతో విజ్ఞానం ఉన్న వ్యక్తి.

ఆయన సినిమాను చూసే పద్ధతి ఒక దర్శకుడి లాగానే ఉంటుంది.

నిజానకి దర్శకత్వం అంటే ఆయనకు ఎంతో ఇష్టం.

అయితే ఆయన మంచి రచయితగానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.వెంకట్ 2003 లో ఒకరికి ఒకరు సినిమాకి రైటర్ గా తొలుత పనిచేశాడు.

ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా వెంకట్ కి మంచి అవకాశాలు అయితే వచ్చాయి.అదే ఎడాది మరో మూడు సినిమాలకు రైటర్ గా పనిచేసిన వెంకట్ 2022 వరకు ఎన్నో చిత్రాలకి రైటర్ గా పనిచేశారు.

Advertisement

చివరగా మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాకి ఆయన రైటర్ గా పనిచేయడం విశేషం.ఇక వెంకట్ కి కేవలం రచయిత గానే కాకుండా నిర్మాతగా మారి దాదాపు 9 సినిమాలు చేశారు.1997లో తోకలేని పిట్ట నుంచి 2021 లో గల్లీ రౌడీ వరకు 9 సినిమాలను ఆయన నిర్మించారు.ఇక ఎందుకంటే ప్రేమంట అనే సినిమాలో నటుడుగా కూడా పనిచేశారు.2008లో మాధవన్, సమితాశెట్టి, సదా లను హీరో, హీరోయిన్స్ గా పెట్టి ఒక సినిమాకి దర్శకత్వం కూడా వహించారు.ఆ సినిమా తెలుగులో నేను తను ఆమె అనే పేరుతో విడుదలైంది.

తమిళ్ లో నాన్ అవళ్ అదు అనే పేరుతో రాగా తెలుగులో డబ్బింగ్ చేయబడింది.ఇక సినిమాల విషయంలో ఆయన ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటారు.ఎందుకంటే తాను చేయాల్సింది చాలా ఉంది అని నమ్మే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు.

ఇటీవల ఆలీతో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చిన కోన వెంకట్ తనకు జరిగిన ఒక ఫన్నీ సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు.నిన్ను కోరి సినిమా సమయంలో ఈ సంఘటన జరిగిందంట.2017 లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.అయితే ఈ సినిమాకి రైటర్ గా పనిచేశారు కోన వెంకట్.

ఫారెన్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో కొండపైన ఒకరోజు ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.అక్కడికి కాఫీ తీసుకురావాల్సిన బాధ్యత కోన వెంకట్ కి అప్పచెప్పారట చిత్ర బృందం.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని

దాంతో కిందనే కారు పెట్టి పై వరకు నడుచుకుంటూ వెళ్లి కాఫీ ఇచ్చారట.కానీ అక్కడికి వెళ్ళాక తీరా చూస్తే కేవలం కాఫీ మాత్రమే ఉంది కాప్స్ లేవు.మళ్ళీ తిరిగి కొండ కింద దాకా నడుచుకుంటూ వచ్చి కప్పులు తీసుకొని పైకి నడుచుకుంటూ వెళ్లారట.

Advertisement

ఈ సంఘటన గురించి ఎప్పుడు తలుచుకున్నా కూడా నవ్వొస్తుంది అంటూ వెంకట్ ఆలీతో చెప్తూ ఆ సినిమా అనుభవాన్ని పంచుకున్నారు.ఇక 2017 వరకు వరుస పెట్టి సినిమాలు చేసిన కోన వెంకట్ అప్పటినుంచి ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలకు మాత్రమే రైటర్ గా పనిచేశారు.

ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా ఆయన కనిపించట్లేదు.

తాజా వార్తలు