Komatireddy Srinidhi : నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి కుమార్తె ? 

తెలంగాణలో కాంగ్రెస్( Congress Party ) నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీలోకి దిగేందుకు చాలామంది కీలక నేతలే పోటీ పడుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో,  ఆ ప్రభావం ఖచ్చితంగా  లోక్ సభ ఎన్నికల్లోనూ( Loksabha Elections ) స్పష్టంగా ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు.

అందుకే కాంగ్రెస్ టికెట్ కోసం ఈ పోటీ ఎక్కువగా నెలకొంది.ఇప్పటికే దరఖాస్తులకు ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించడంతో పెద్ద ఎత్తున ఆశావాహులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే .తెలంగాణలో కీలక స్థానంగా ఉన్న నల్గొండ( Nalgonda ) నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అంతే స్థాయిలో పోటీ నెలకొంది.ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) ప్రస్తుతం రాష్ట్ర రోడ్లు,  భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్నారు.

ఈసారి జరిగే లోకసభ ఎన్నికల్లో తన వారసురాలిగా కోమటిరెడ్డి శ్రీ నిధిని( Komatireddy Srinidhi ) ఎంపీ అభ్యర్థిగా పోటీకి దించేందుకు వెంకట రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.కచ్చితంగా ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉండడంతో,  చాలామంది ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు .ఈ క్రమంలోనే వెంకటరెడ్డి తన కుమార్తెను పోటీకి దించే ఆలోచించడంతో ఉన్నారు.కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన కోమటిరెడ్డి పవన్ అనే వ్యక్తి ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

  అలాగే ఇదే స్థానం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్( Raghuveer ) సైతం దరఖాస్తు చేసుకున్నారు.

అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి పార్టీ పెద్దలు ఒత్తిడితో సీటు త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డి( Patel Ramesh Reddy ) కూడా ఎంపీ టికెట్ తనకే వస్తుందనే ధీమాలో ఉండగా,  వెంకట్ తన కుమార్తె శ్రీనిధి ని పోటీకి దించేందుకు ప్రయత్నిస్తూ ఉండడం,  ఆయన కాంగ్రెస్ లో సీనియర్ నేత కావడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధికే నల్గొండ ఎంపీ టికెట్ దక్కే ఛాన్స్ ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు