మొత్తానికి కోమటిరెడ్డి యూటర్న్ తీసుకున్నాడా

మొన్నటివరకు వీరావేశం తో మాట్లాడిన కోమటి రెడ్డి యూటర్న్ తీసుకున్నారా.ఆయన తాజా వ్యాఖ్యలు వింటే మాత్రం ఖచ్చితంగా యూటర్న్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

మొన్నటికి మొన్న కాంగ్రెస్ కు తెలంగాణ లో భవిష్యత్తు లేదని,కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే దానికి ప్రత్యామ్న్యాయం ఒక్క బీజేపీ నే అంటూ వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా బీజేపీ తెలంగాణా లో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని అంటూ కూడా ఒక కార్యకర్త తో ఫోన్ లో సంభాషించిన ఆడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మరోపక్క ఆయన పార్టీ మారుతున్నట్లు తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతున్న సమయంలో బహిరంగంగానే స్పందించి త్వరలోనే చేరిక ఉంటుంది అని కూడా ప్రకటించారు.ఇన్ని తతంగాలు చేసిన అయ్యగారు ఇప్పుడు తాజాగా యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.అంతేకాకుండా పార్టీ బాగు కోసమే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా పై వ్యాఖ్యలు చేశానంటూ వివరణ ఇచ్చుకున్నారు.

అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్న అధిష్టానం నాకు కేవలం షోకాజ్ నోటీసులు మాత్రమే ఇచ్చిందని, ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

అయితే ఈయన గారి వాలకం చూస్తుంటే అటు కమలం లోకి వెళ్లలేక,ఇటు హస్తం తో ఉండలేక ఊగిసలాడుతున్నట్లు అర్ధం అవుతుంది.తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుంచి విజయం సాధించిన రాజగోపాల్ రెడ్డి.సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించడంలో కీలక భూమిక పోషించిన ఆయన అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్యకు టికెట్ దక్కించుకుని ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు