తెలుగులో ప్లాప్ అయితే అక్కడ హిట్టు పక్కా? ఈ లెక్క ఏంటో తెలుసా ?

మొన్నటి వరకు తెలుగులో కేవలం చిన్న హీరోలు మాత్రమే కొత్త రకం సినిమాలను ఎంచుకునేవారు.

కానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలు సైతం కథలో కొత్తదనం ఉండాలి అని ఫిక్సై పోయారు.

కాస్త కొత్తగా ఉంటేనే ముందడుగు వేస్తున్నారు.లేదంటే సినిమా చేయటం లేదూ.

కొంతకాలం నుంచి స్టార్ హీరోలు నటించిన సినిమాలు చూస్తుంటే ఇది స్పష్టంగా అర్థమవుతోంది.ఇక ఇలా విభిన్నమైన కథతో వచ్చినప్పుడే బ్లాక్బస్టర్ విజయాలను సాధించగలం అని అనుకుంటున్నారు స్టార్ హీరోలు.

కథ బాగుండాలి కానీ చిన్న హీరోలకు సైతం బిగ్ హిట్ ఇచ్చేస్తున్నారు.ప్రేక్షకులు కానీ అటు తమిళ ఇండస్ట్రీలో మాత్రం మరోలా రకంగా ఉంది అని అర్థమవుతుంది.

Advertisement

టాలీవుడ్లో ప్లాప్ అయిన సినిమాలు అటు కోలీవుడ్లో మాత్రం సూపర్ విక్టరీని అందుకుంటూన్నాయి.గత కొంత కాలం నుంచి చూసుకుంటే రొటీన్ మాస్ మసాలా సినిమాలే కోలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు అని తెలుస్తోంది.

కొత్త సినిమాలు వచ్చాయి అంటే అటువైపుగా కూడా చూడట్లేదు కోలీవుడ్ ప్రేక్షకులు.ఇక ఇటీవలే అజిత్ నటించిన వాలిమై సినిమా విషయంలో కూడా ఇదే నిజం అయింది.

భారీ అంచనాల మధ్య వాలిమై సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తెలుగులో కూడా ఈ సినిమాని విడుదల చేశారు.

అయితే ఈ సినిమాకి టాలీవుడ్లో మంచి టాక్ రాలేదు.కానీ అటు కోలీవుడ్లో మాత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తు దూసుకుపోతోంది.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్... ఈ హీరో గ్రేట్!
దొరికేసాడు.. దొరికేసాడు.. ఇండియన్ స్పైడర్ మ్యాన్ ఇదిగో.. (వైరల్ వీడియో)

ఇలా టాలీవుడ్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు అటు కోలీవుడ్ లో సూపర్ హిట్ అవుతున్నాయి.

Advertisement

ఈ ఒక్క సినిమా విషయంలోనే కాదు మిగతా అన్ని సినిమాల విషయంలో కూడా అదే జరిగింది.మొన్నటికి మొన్న రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పెద్దన్న సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా తమిళంలో మాత్రం మంచి విజయాన్ని సాధించింది.

ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సినిమాల విషయంలో కూడా కోలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా రొటీన్ మసాలా ఇష్టపడుతున్నారు.ఇలా కోలీవుడ్ లో హిట్ అయిన సినిమాలు మాత్రం టాలీవుడ్లో భారీ స్థాయిలో రేటింగ్స్ రావడం లేదు.ఇలా టాలీవుడ్ హీరోలు కొత్తదనం వెతుక్కుంటూ ముందుకు పోతూ ఉంటే కొలీవుడు లో మాత్రం కమర్షియల్ సినిమాలే కోరుతున్నారు.

కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్ అయిన కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో ఆ కొత్తదనం తగ్గింది అన్న టాక్ కూడా ఉంది.

" autoplay>

తాజా వార్తలు