కోకాపేట భూములు వేలం.. ఎకరం 45 కోట్లు..!

హైదరాబాద్శివారు ప్రాంతం కోకాపేటలోని ప్రభుత్వ భూములు గురువారం వేలం వేశారు.ఈ వేలానికి ఊహించని విధంగా స్పందన వచ్చినట్టు తెలుస్తుంది.

అక్కడ భూములు అత్యధిక ధరలు పలికాయి.భూముల వేలానికి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్.

ఎం.డి.ఏ) సన్నాహాలు చేస్తుండగా నేడు నియో పోలీస్ వెంచర్ లోని 49.92 ఎకరాలను ఇవాళ ఎమ్మెస్టీసీ వెబ్ సైట్ ద్వారా వేలం వేశారు.ఈ వేలంలో ఒక్కో ఎకరం 45 కోట్ల రూపాయలకు పైగా ధర పలికినట్టు తెలుస్తుంది.

ధర అంత ఎక్కువ పలకడంతో ప్రభుత్వ వర్గాల్లో హంగామా మొదలైంది.ఎకరం కనీస ధర పాతిక కోట్ల రూపాయలు ప్రకటించగా దానికి రెట్టింపు ధర వేలంలో రావడం విశేషం.

Advertisement

అయితే వేలం వేసిన భూములు అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉండటం వల్లే ఈ రేంజ్ లో ధర పలికినట్టు చెప్పుకుంటున్నారు.ఈ వెంచర్ కు చేరుకునేందుకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లను కూడా ప్రభుత్వం నిర్మిస్తుందని తెలుస్తుంది.

అందుకే రియల్ వ్యాపారులు భారీగా వేలం పాటలో పాల్గొన్నారట.గతంలో ఇక్కడ భూములు వేలం వేయగా 40 కోట్ల దాకా రేటు పలికాయని ఈసారి అంతకు మించి ధర పలికిందని చెప్పుకుంటున్నారు.

ఇక ప్రభుత్వ భూములు కాకుండా మిగిలిన భూములు ఎకరం 50 కోట్ల వరకు వెళ్తుందని చెబుతున్నారు.ఈరోజు జరిగిన వేలంలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నట్టు తెలుస్తుంది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు