అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. కానీ...

తెలుగు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే "కోయిలమ్మ" ధారావాహికలో హీరోయిన్ గా నటిస్తూ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న "కన్నడ బ్యూటీ తేజస్విని గౌడ" గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

చక్కని ముఖ కవళికలు అందం అభినయం ఉన్నటువంటి తేజస్విని ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.

కాగా తాజాగా తేజస్విని గౌడ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తనని పెళ్లి చేకోబోయే వ్యక్తి ఎలా ఉండాలనే విషయాల గురించి పలు ఆసక్తికర విషయాలను నెటిజన్లతో పంచుకుంది.ఇందులో భాగంగా తనని పెళ్లి చేసుకోబోయే వాడు పెద్దగా అందంగా లేకున్నా మరియు డబ్బు లేకున్నా సరే ఫర్వాలేదు కాని తనని మాత్రం లైఫ్ లాంగ్ చాలా బాగా చూసుకుంటే చాలని తన మనసులో మాటను వ్యక్తం చేసింది.

అంతేకాకుండా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని తనని ప్రోత్సహించాలని అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటానని కూడా స్పష్టం చేసింది.అందువల్లనే పెళ్ళంటే నూరేళ్ళ పంట కాబట్టి ప్రతి విషయంలో తనకు తోడుగా నిలిచే వ్యక్తి భాగస్వామిగా దొరికితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చని చెప్పుకొచ్చింది.

ఇక సినిమా పరిశ్రమలో తన క్రష్ గురించి స్పందిస్తూ తనకు కేజిఎఫ్ స్టార్ హీరో యష్ అంటే చాలా ఇష్టమని కానీ ఇప్పుడు యష్ కి పెళ్లి అయిపోయి ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నారని సరదాగా చెప్పుకొచ్చింది.అయితే యష్ కేజిఎఫ్ చిత్రంలో నటించడానికంటే ముందుగానే తన క్రష్ గా ఉన్నాడని కూడా స్పష్టం చేసింది.

Advertisement

దీంతో యష్ గురించి మాట్లాడాలంటే ఒక రోజంతా అయినా సరే మాట్లాడుతూనే ఉంటానని హీరో యష్ పై తనుకున్న అభిమానం గురించి తెలిపింది.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తేజస్విని గౌడ తెలుగు లో ప్రసారమయ్యే కోయిలమ్మ ధారావాహికలో పాటు కన్నడ, తమిళ, భాషలలో కూడా పలు ధారావాహికలలో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో తనకి పెద్దగా తెలుగు భాష మాట్లాడటం, రాయడం రాదని కానీ ప్రస్తుతం చాలా స్పష్టంగా తెలుగు భాషను మాట్లాడటం, రాయడం నేర్చుకున్నానని తెలిసింది.అంతే కాకుండా తనని తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని అందుకుగాను కృతజ్ఞతలు కూడా చెప్పింది.

Advertisement

తాజా వార్తలు