కోహ్లీ-అనుష్కల బాడీగార్డ్ శాలరీ తెలిస్తే షాక్ అవుతారు..!

సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు పబ్లిక్ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తమ బాడీగార్డులను తప్పకుండా తీసుకెళ్తుంటారు.

అభిమానులు లేదా శత్రువుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాడీగార్డులు అనుక్షణం సెలబ్రిటీలకు రక్షణ కల్పిస్తుంటారు.

టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బాడీగార్డులను మెయింటైన్ చేస్తున్నాడు.బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మతో పెళ్లయిన తర్వాత కోహ్లీని ప్రకాశ్ సింగ్ అకా సోనూ అనే బాడీగార్డ్ రక్షిస్తున్నాడు.

ప్రకాష్ సింగ్ మొదట అనుష్కకు పర్సనల్ బాడీగార్డ్‌గా ఉండేవాడు.కానీ పెళ్లయ్యాక అతడు విరాట్ కోహ్లీకి కూడా బాడీగార్డ్ గా వ్యవహరిస్తున్నాడు.

అయితే ప్రకాష్ సింగ్ అంటే అనుష్క దంపతులకు చాలా ఇష్టం. ఈ జంట అతడిని ఒక పనివాడిలా కాకుండా కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేస్తుంటారు.

Advertisement

అంతేకాదు ప్రముఖ కంపెనీల సీఈఓల కంటే ఎక్కువ జీతం చెల్లిస్తున్నారు.విశ్వసనీయ సమాచారం ప్రకారం, అనుష్క, కోహ్లీ కలిసి ప్రకాష్ సింగ్ సోనూకి ఏడాదికి అక్షరాల 1.2 కోట్లు జీతంగా ఇస్తున్నారు.దీని అర్థం ప్రతి నెలా సోనూ రూ.8 లక్షల 50 వేలు సంపాదిస్తున్నాడు అన్నమాట.సోనూ చూపిస్తున్న విశ్వసనీయత, అంకితభావం, రక్షణకు వెలకట్టలేమని అతడికి ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువే అన్నట్లు అనుష్క దంపతులు సన్నిహితులతో అంటున్నారట.

అయితే ఈ స్థాయిలో సోనూ నిజంగానే జీతం అందుకుంటున్నట్లయితే.ఇది భారత కంపెనీలలో పని చేస్తున్న చాలామంది సీఈఓల కంటే అధికమని చెప్పొచ్చు.

ఇక సోనూ పుట్టినరోజును విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కలిసి ఎన్నోసార్లు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.జీరో మూవీ షూటింగ్ సమయంలో కూడా అనుష్క సోనూ పుట్టినరోజు వేడుకలు జరిపి ఆశ్చర్యపరిచింది.అప్పుడే అనుష్కకు సోనూ అంటే ఎంత ఆప్యాయత ఉందో అందరికీ తెలిసి వచ్చింది.

ఇక అనుష్క గర్భధారణ సమయంలో కూడా సోనూ ఆమెకు అన్ని పనులు చేసి పెట్టాడట.అనుష్క జన్మనిచ్చిన వామికాకు కూడా అతడు నిరంతరాయంగా రక్షణ అందిస్తున్నాడు.మీడియా కంట పడకుండా వామికాను అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నాడు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు