దీపావళికి ముందే రిలయన్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులు.. బెనిఫిట్స్ ఇవే..!

దీపావళి కంటే ముందే రిలయన్స్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా క్రెడిట్ కార్డులను తీసుకురానున్నాయి.

ఈ క్రమంలో రెండు కోబ్రాండెడ్ రిలయన్స్ ఎస్బీఐ కార్డులను ( Reliance SBI Credit Card ) విడుదల చేయనున్నాయి.

ఈ క్రెడిట్ కార్డుల ద్వారా రిలయన్స్ రిటైల్ స్టోర్ లలో లావాదేవీలపై వినియోగదారులకు ప్రత్యేకమైన ఆఫర్లు రిలయన్స్ ప్రకటించింది.ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఫార్మా, కిరాణా వస్తువులపై మంచి ఆఫర్లు పొందవచ్చు.

రిలయన్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే వినియోగదారులు పొందే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే ప్రతి ఏడాది వార్షిక రుసుం రూ.499 చెల్లించాలి.అయితే ఒక ఏడాదిలో ఈ కార్డు ద్వారా రూ.100000 ఖర్చు చేసిన వినియోగదారులకు మాత్రం వార్షిక రుసుము మినహాయింపు ఉంటుంది.ఈ క్రెడిట్ కార్డు( Credit Card ) ద్వారా ఇంటి అద్దె, వాలెట్ అప్లోడ్, ఇంధనం లాంటి లావాదేవీలు కాకుండా ఇతర కొనుగోళ్లపై ఖర్చు చేస్తే ప్రతి రూ.100 ఖర్చుకు ఒక రివార్డ్ పాయింట్( Reward Points ) అందించబడుతుంది.

Know Reliance Sbi Credit Card Benefits Details, Reliance Sbi Credit Card, Relian

అదే రిలయన్స్ స్టోర్, డైనింగ్, సినిమాలపై ఖర్చు చేస్తే ప్రతి రూ.100 ఖర్చుకు 5 రివార్డ్ పాయింట్స్ అందించబడతాయి.అన్ని పెట్రోల్ పంపులలో ఒక శాతం ఇంధన సర్ ఛార్జ్( Fuel Surcharge ) మినహాయింపు ఉంటుంది.రిలయన్స్ ఎస్బీఐ కార్డు ప్రైమ్( Reliance SBI Credit Card Prime ) తీసుకుంటే వినియోగదారులు పొందే ప్రయోజనాలు ఇవే: ఈ కార్డు వార్షిక రుసుము రూ.2999.అయితే ఈ కార్డు ద్వారా ఏడాదిలో రూ.3 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రుసుము మినహాయింపు ఉంటుంది.

Know Reliance Sbi Credit Card Benefits Details, Reliance Sbi Credit Card, Relian
Advertisement
Know Reliance SBI Credit Card Benefits Details, Reliance SBI Credit Card, Relian

ఈ కార్డు ద్వారా రిలయన్స్ రిటైల్ స్టోర్ లలో( Reliance Retail Store ) కొనుగోలు చేస్తే ప్రతి రూ.100 ఖర్చుకి పది రివార్డు పాయింట్లు పొందవచ్చు.అంతర్జాతీయ వ్యయం, విమానయాన సంస్థలు, సినిమాలు లాంటి వాటిపై ఖర్చు చేస్తే రూ.100 ఖర్చుకు ఐదు రివార్డ్ పాయింట్స్ అందించబడతాయి.ఈ కార్డు ద్వారా ఇంటి అద్దె, వాలెట్ అప్లోడ్, ఇంధనం లాంటి లావాదేవీలు కాకుండా ఇతర కొనుగోళ్లపై రూ.100 ఖర్చుకు 2 రివార్డ్ పాయింట్స్ అందించబడతాయి.అన్ని పెట్రోల్ పంపుల్లో ఒక శాతం ఇంధన సర్ చార్జ్ మినహాయింపు ఉంటుంది.అంతే కాదు బుక్ మై షో లో( Book My Show ) ప్రతి నెల రూ.250 విలువైన ఒక సినిమా టికెట్ కూడా ఈ కార్డు ద్వారా పొందవచ్చు.

వైరల్ వీడియో.. అరెరే.. ఇక్కడ మహేష్ బాబు ఫైటింగ్ సీన్ ఉందా? చూడనే లేదు!
Advertisement

తాజా వార్తలు