స్కూల్ ప్రిన్సిపాల్‌కు క్యూట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన కిండర్ గార్టెన్ పిల్లలు.. వీడియో చూస్తే ఫిదా..

జమ్మూ కశ్మీర్ )(Jammu and Kashmir)చిన్నారులు ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్స్ అయిపోయారు.వీళ్లు తమ ప్రిన్సిపల్ కోసం టీ (TEA)పెట్టారు.

ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే ఫిదా అవడం ఖాయం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్యూట్ వీడియోలో, జమ్మూ కశ్మీర్‌లోని ఓ స్కూల్‌కు చెందిన పిల్లలు వాళ్ల ప్రిన్సిపల్ కోసం స్వయంగా టీ తయారు చేశారు.

ఈ వీడియోను అనిల్ చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌లో(Anil Chaudhary on Instagram) షేర్ చేశాడు.ఈ క్లిప్‌ను జమ్మూలోని ఆర్.ఎస్.పురా దగ్గర కోట్లి గాలా బానా అనే ఊళ్లో ఉన్న మాంటిస్సోరి నర్గీస్ దత్ పబ్లిక్ స్కూల్‌లో తీశారు.వీడియోలోకి వెళ్తే, బుడ్డోళ్లంతా కలిసికట్టుగా, ఎంతో ఉత్సాహంగా టీ చేస్తున్నారు.

చిన్న గ్యాస్ స్టవ్, గిన్నె, కప్పులు, టీ పొడి.అన్నీ టేబుల్‌పై రెడీగా ఉన్నాయి.

Advertisement
Kindergarten Children Give A Cute Surprise To The School Principal.. Watch The V

ఒక పక్క పోడ్‌కాస్ట్ మైక్ కూడా ఉంది, అది ఎందుకో మరి.పిల్లల్లో ఒకడు లీడర్‌లా ముందుకొచ్చి, టీ ఎలా పెట్టాలో క్లాస్‌మేట్స్‌కి చెప్పడం మొదలుపెట్టాడు.

Kindergarten Children Give A Cute Surprise To The School Principal.. Watch The V

అతను వెంటనే చోటు అనే ఫ్రెండ్‌ని పలకరించి, "నీకు టీ పెట్టడం వచ్చా?" అని అడిగాడు.రాదు అని చోటు అంటే, "నేర్పిస్తాలే ముందు గ్యాస్ వెలిగించు" అంటూ టీ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు ఆ బుడ్డోడు.పిల్లలంతా అతడు చెప్పినట్టే ఒక్కొక్కరూ ఒక్కో ఇంగ్రిడియంట్ వేస్తూ, టీ మరుగుతుంటే కళ్లప్పగించి చూశారు.

టీ రెడీ అవ్వగానే మంచి వాసన చూసి మురిసిపోయారు.ఆ తర్వాత ఆ లీడర్ పిల్లవాడు "చలో చాయ్ పీతే హై" (రండి టీ తాగుదాం)(Come on, lets have tea.) అంటూ అందరినీ పిలిచాడు.దాంతో పిల్లలంతా హ్యాపీగా వాళ్ల చేత్తో చేసిన టీ తాగేశారు.

ఆ వీడియో అక్కడితో ఎండ్ అయిపోయింది.

Kindergarten Children Give A Cute Surprise To The School Principal.. Watch The V
10 ఏళ్లుగా ఎన్టీఆర్ రికార్డును టచ్ చేయని హీరోలు... పుష్ప కూడా బీట్ చెయ్యలేదా?
పప్పు అన్నం 'నేషనల్ లంచ్' అవ్వాలట.. స్విగ్గీ వైరల్ పోస్ట్‌ పై నెటిజన్లు రియాక్షన్ ఇదే!

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.నెటిజన్లు ఈ బుడ్డోళ్ల టీం వర్క్‌కి ఫిదా అయిపోయారు.ఒక యూజర్ "నేను స్కూల్ పెడితే సిలబస్ మొత్తం ఇలాగే ఉండాలి" అని కామెంట్ పెట్టాడు.

Advertisement

డిజిటల్ క్రియేటర్ నవీన్ కుక్రెజా కామెంట్ చేస్తూ "ఇదే ప్రపంచంలోనే బెస్ట్ స్కూల్.చలో సబ్ చాయ్ పీతే హై" అని రాసుకొచ్చాడు.ఇంకొక నెటిజన్ అయితే "సూపర్ క్యూట్, ఇలాంటి యాక్టివిటీస్‌తో స్కూల్ వాళ్లు గ్రేట్ జాబ్ చేస్తున్నారు" అంటూ కామెంట్ చేశాడు.

ఇదిలా ఉండగా, పిల్లలు ఇలా టాలెంట్ చూపించడం ఇదేం మొదటిసారి కాదు.ఇంతకుముందు నాగాలాండ్‌లోని కోహిమాలో ఉన్న కె.ఖేల్ గవర్నమెంట్ మిడిల్ స్కూల్‌ పిల్లలు కూడా ఇరగదీశారు.వాళ్లు సొంతంగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించి, వాటితోనే మధ్యాహ్న భోజనం చేసేవాళ్లు.

క్యాబేజీ, బంగాళాదుంప, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుమ్మడికాయ, స్క్వాష్, దానిమ్మ, నిమ్మకాయలు ఇలా చాలా రకాల వెజిటేబుల్స్‌ని వాళ్లే పండించారు.

తాజా వార్తలు