కారు డిక్కీలో పిల్లలను పెట్టి, ఎంచక్కా కారులో కులుకుతున్న తల్లిదండ్రులు? 

పెళ్లి చేసుకొని పిల్లలని కంటే సరిపోదు.వారిని కంటికి రెప్పలాగా బాధ్యతతో కాపాడుకోవాలి.

అలాంటి బాధ్యత లేనపుడు అసలు పెళ్లిచేసుకోకపోవడమే ఉత్తమం.అవును.

ఇక్కడి వీడియో చూస్తే మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది.ఇంతకంటే ఘోరంగా వారిని తిట్టాలని అనిపిస్తుంది.

ముఖ్యంగా తల్లిదండ్రులు అనబడేవారు ఇలా అస్సలు ఉండకూడదు.ముఖ్యంగా రోడ్డుపైన ప్రయాణించినపుడు ఇలాంటి పనులు చేయకూడదు.

Advertisement

కొంతమంది రాష్‌గా డ్రైవింగ్ చేసారనో, మరికొందరు బేసిక్ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ చేస్తున్నారనో పోలీసులు చర్యలు తీసుకుంటారు.అయితే తాజాగా జరిగిన చర్య మాత్రం అంతకు మించి వుంది.

ఇక్కడ వీడియోలో మనకు స్పష్టంగా కనబడుతోంది.కారు డిక్కీలో పిల్లలను కూర్చోబెట్టి ముందు చాలా జాలిగా వారి తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తున్నారు.దాంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.TS7HA8607 అనే నంబర్ ప్లేట్ గల కారు జాతీయ రహదారిలో వెళుతోంది.ఆ కారు డిక్కీలో ముగ్గురు పిల్లలు (ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి) ఉన్నారు.

ముగ్గురు కూడా కూడా కారు డిక్కీలో కూర్చుని ఓ బొమ్మతో ఆడుకోవడం ఇక్కడ చూడవచ్చు.

అయితే కారు లోపల ఉన్న పేరెంట్స్ మాత్రం అసలు వారు ఉన్నారనే విషయం కూడా పట్టించుకోకపోవడం గమనార్హం.కాగా, ఈ ఘటనను వెనకాల వెళుతున్న కారులోని వారు వీడియో తీశారు.నంబర్ ప్లేట్ కనబడేలా జూమ్ చేసి మరీ వీడియో తీయడంతో వెలుగు చూసింది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి

ఆ వీడియోనూయి సోమవారం సోంచో జరా అనే ట్విట్టర్ వినియోగదారుడు పోస్ట్ చేశాడు.వారు బాధ్యత లేని తల్లిదండ్రులు?.దయచేసి ఈ వీడియో చూసి చర్యలు తీసుకోండి అని @KTRTRS, @TelanganaCOPs, @HiHyderabad, @tsrtcmdoffice పేర్లను ట్యాగ్ చేశాడు.

Advertisement

ఈ ట్వీట్‌పై స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కారు నంబర్ ప్లేట్‌ను ఆధారంగా చలాన్ జారీ చేశారు.సర్ మీ ఫిర్యాదు మేరకు సదరు వాహనదారుడికి ఇ-చలాన్ పంపాము.

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేయడం విశేషం.

తాజా వార్తలు