సౌత్ లో మరో స్టార్ హీరోకి జోడీగా అవకాశం పట్టేసిన కియరా

ధోని సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ కీయరా అద్వానీ.

ఇక టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా నటించే అవకాశం సొంతం చేసుకుంది.

భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.తరువాత రామ్ చరణ్ కి జోడీగా వినయ విదేయ రామ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.

Kiara Advani To Romance Vijay In Thalapathy-సౌత్ లో మరో స�

అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.ఇందిలాలో బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ లో నటించి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సౌత్ సినిమాలు వదిలేస్తుంది అని అందరూ భావించారు.అయితే ఊహించని విధంగా ఈ భామ ఇప్పుడు మరో సౌత్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

తమిళంలో ఇలయదళపతి విజయ్ సరసన ఓ భారీ చిత్రంలో ఈ భామకి భారీ చిత్రంలో ఛాన్స్ దక్కిందని తెలుస్తుంది.దళపతి 64 వ చిత్రంలో ఈ భామ నటించబోతుంది.

ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు.అయితే తెలుగులో వచ్చిన అవకాశాలని ఈ భామ ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది.

బాలీవుడ లో అవకాశాలు పెరగడంతో కాల్షీట్స్ పెరగడంతో తెలుగు సినిమాల మీద పెద్ద ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.

పహల్గాం బాధితుడి ఇంటికి అనన్య నగళ్ల.. ఈ నటి నిర్ణయాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే!
Advertisement

తాజా వార్తలు