కేజీఎఫ్-2 టీజర్.. వచ్చే ఏడాదేనట!

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయ్యి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త పాన్ ఇండియా హీరో లభించాడు.

ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ చిత్రానికి కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్‌లో విజయం సాధించింది.

అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సీక్వెల్ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.

ఈ ఏడాది వేసవిలో రిలీజ్ కావాల్సిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కరోనా కారణంగా వాయిదా పడింది.కాగా ప్రస్తుతం షూటింగ్ చివరి దశ జరుపుకుంటున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’కు సంబంధించిన టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Advertisement

అయితే ఈ టీజర్‌ను ఇప్పట్లో రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ లేదని తెలుస్తోంది.ఈ టీజర్‌ను ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా మలిచేందుకు చిత్ర యూనిట్ మరింత సమయాన్ని తీసుకుని, ఈ టీజర్‌ను 2021 ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అంతే ఆలస్యం చేయనుండటంతో ప్రేక్షకులు ఈ టీజర్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.ఇక రాకీ భాయ్‌ను ఎప్పుడెప్పుడు వెండితెరపై చూద్దామా అని ఆయన అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా, ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు