ప్రైవేట్ స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ

హైదరాబాద్ : మే 31 హైదరాబాద్ డీఈవో గురువారం నగరంలోని ప్రయివేటు స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

యూనిఫామ్‌లు, షూస్, బెల్టుల అమ్మకాలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.

స్కూల్ ప్రాంగణంలో బుక్స్, స్టేషనరీ కూడా అమ్మకూడ దని ఆదేశించారు.హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న ప్రభుత్వ, ప్రయివేటు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్ళకు ఆదేశాలు వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ప్రయివేటు పాఠశాలల నిరంతర పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులను ఆదేశించారు.కోర్టు ఆదేశాల మేరకు పాఠ శాల కౌంటర్‌లో విక్రయాలు ఉంటే లాభాపేక్ష లేకుండా ఉండాలని పేర్కొన్నారు.

అందుకే స్కూళ్లలో ఎలాంటి విక్రయాలు ఉండరాదన్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఉల్లంఘనలు జరిపితే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు.

Advertisement
Elon Platform Overview And Key Features For UK Players

Latest Hyderabad News