తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లాంటి స్టార్ హీరో అహర్నిశలు కష్టపడుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కూడా పొందుతున్నాయి.
ఇక ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్ అయిన విజయ్ దేవరకొండ మరొక సినిమా కూడా కమిట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే ఈయన చేయబోయే నాలుగో సినిమా తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్న హరీష్ శంకర్ తో( Harish Shankar ) ఉండబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
అర్జున్ రెడ్డి( Arjun Reddy ) తర్వాతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉంది.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అయితే పట్టాలెక్కలేదు మరి ఎప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుందనేది చూడాలి.ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే హరీష్ శంకర్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.మరి విజయ్ దేవరకొండ కి కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందిస్తాడా లేదా అనే విషయాలకు కూడా తెలియాల్సి ఉంది.
అయితే వీళ్ళ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి రెండు సంవత్సరాల వరకు సమయం అయితే పట్టే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఇప్పుడు మూడు సినిమాలు కమిట్ అయిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలు పూర్తయిన తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే ఆయన తీసిన చాలా సినిమాలు ఇప్పటికే మంచి విజయాలు సాధించడం తో విజయ్ ను ఆయన ఎలా చూపిస్తాడు అనేది కూడా ఇప్పుడు విజయ్ అభిమానుల్లో చర్చలకు దారితీస్తుంది… చూడాలి మరి వీళ్ళ కాంబో లో సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధిస్తుంది అనేది…
.